Raj Tarun Controversy : హీరోతో ఎఫైర్ ఆరోపణలపై హీరోయిన్ ఫైర్… పోలీస్ స్టేషన్‌లోనే తేల్చుకుంటా…

Raj Tarun Controversy : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మరో హీరోయిన్ మోజులో పడి, తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ అమ్మాయి ఏ హీరోయిన్ తో రాజ్ తరుణ్ పెట్టుకున్నాడని కామెంట్స్ చేసిందో, ఆ హీరోయిన్ తాజాగా రియాక్ట్ అయింది. లావణ్య చేసిన ఆరోపణపై స్పందిస్తూ పోలీస్ స్టేషన్లో తేల్చుకుంటాను అంటూ ఫైర్ అయింది. మరి అసలు ఈ వివాదంపై రియాక్ట్ అయిన హీరోయిన్ ఎవరు ? ఆమె రాజ్ తరుణ్ తో ఎఫైర్ గురించి ఏం చెప్పింది ? అనే వివరాల్లోకి వెళితే…

హీరోయిన్ రియాక్షన్…

హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ కి ఎఫైర్ ఉందంటూ లావణ్య సంచలన ఆరోపణ చేసింది. తాజాగా మాల్వి మల్హోత్రా స్పందిస్తూ నటించాననేది నిజమేనని చెప్పుకొచ్చింది. కానీ అతడి గురించి తనకేమీ తెలియదని, లావణ్య అలా ఎందుకు చెప్తోందో అర్థం కావట్లేదని మండిపడింది. అంతేకాకుండా ఆమెను తమ ఫ్యామిలీలో ఎవ్వరు బెదిరించలేదని, పైగా ఆ అమ్మాయి తిరిగి తమను బెదిరిస్తోందని వాపోయింది. లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మాల్వి హెచ్చరించింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇద్దరు జంటగా తిరగబడరా సామీ అనే సినిమా చేశారు. అయితే ఈ వివాదంపై రాజ్ తరుణ్ కూడా స్పందిస్తూ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో తమ రిలేషన్ సినిమా వరకేనని క్లారిటీ ఇచ్చారు. ఆమె తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, లావణ్య కావాలని తమ ఇద్దరి పై తప్పుడు ఆరోపణలు చేస్తుందని వెల్లడించారు.

Thiragabadara Saami : రాజ్ తరుణ్ 'తిరగబడరసామీ' మూవీ ప్రెస్ మీట్ గ్యాలరీ.. | Raj tarun malvi malhotra photos at thiragabadara saami movie pressmeet-10TV Telugu

- Advertisement -

అసలు వివాదం ఏంటంటే…

రీసెంట్ గా డ్రగ్స్ కేసులో చిక్కుకున్న లావణ్య తనను హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్ షిప్ లో ఉన్నామని, గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నామని ఆరోపించింది. అయితే రాజ్ తరుణ్ ను వదిలేయాలని, లేదంటే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొంది. అంతేకాకుండా తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, దీంతో 45 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని వాపోయింది. తను జైల్లో ఉన్నప్పుడే రాజ్ తరుణ్ అసలు పట్టించుకోలేదని, మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడిపిస్తున్నాడని కామెంట్స్ చేసింది. ఆమె రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేసిందని వార్త బయటకు వచ్చిన క్షణాల్లోనే రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. తనపై లావణ్య చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని, అయితే తామిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్న మాట మాత్రం వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆమె డ్రగ్స్ కి అలవాటు పడడంతో పాటు వేరే అబ్బాయితో ఎఫైర్ పెట్టుకోవడంతో దూరం పెట్టానని చెప్పుకొచ్చారు. ఆమె తనను టార్చర్ చేస్తుండడంతో లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నానని, ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఆమె సొంత తండ్రిని మోసం చేసిందని, డబ్బు కోసమే ఇదంతా చేస్తోందని పేర్కొన్నాడు. అయితే 2017 నుంచి ఆ అమ్మాయికి దూరంగా ఉంటున్నానని, కానీ తను ఇబ్బంది పెడుతోంది అనే విషయం పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తే తన రిప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందో అని భయపడి ఇంత దాకా సైలెంట్ గా ఉన్నానని అన్నారాయన.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు