Jai HanuMan : మెగా ఫ్యాన్స్‌కు అసలైన పూనకాలు ఇప్పుడే… హనుమంతుడి పాత్రలో ఎవరో గెస్ చేయగలరా…?

Jai HanuMan : హనుమాన్ సినిమా వచ్చింది… పెద్ద హీరోల సినిమాలను పక్కకు నెట్టి 100 కోట్ల కలెక్షన్లను వేసుకుని వెళ్లిపోయింది. అయితే అది అక్కడితే ఆగడం లేదు.. దానికి సీక్వెల్ రాబోతుంది. జై హనుమాన్ పేరుతో ప్రశాంత్ వర్మ మూవీ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. దీని గురించి టైం వచ్చినప్పుడల్లా.. డైరెక్టర్ గానీ, నిర్మాతలు గానీ స్పందిస్తునే ఉన్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాత జై హనుమాన్ లో హనుమాన్ పాత్ర గురించి ఓ క్లూ వదిలారు. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…

హనుమాన్ హిట్ అయిన తర్వాత జై హనుమాన్ పై చాలా అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ తో ఇంప్రెస్ అవ్వడం తో పాటు హనుమాన్ మూవీ క్లైమాక్స్ లో హనుమంతుడి గురించి చూపించడంతో పాటు సీక్వెల్ లో హనుమంతుడు వస్తాడు అని మూవీ టీం చెప్పడంతో ఈ అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ సీక్వెల్ లో హనుమంతుడిగా ఎవరు కనిపిస్తారు…? ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో సమాధానం లభించని ప్రశ్న.

అయితే హనుమాన్ సినిమాలో హనుమంతుడి కళ్లను చూసి చిరంజీవి అని అనుకున్నారు. అలాగే సినిమాలో హనుమాన్ విగ్రహాన్ని స్టాలిన్ సినిమాలోని చిరంజీవి లుక్ ను బట్టి తీసుకున్నట్టు కొన్ని సందర్భంల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే హనుమంతుడి పాత్ర చిరంజీవి చేయ్యడం లేదు అని కూడా ప్రశాంత్ వర్మ చెప్పాడు. మరి హనుమంతుడు ఎవరు..?

- Advertisement -
Ram Charan as Hanuman
Ram Charan as Hanuman

ఇదే ప్రశ్న రీసెంట్‌గా హనుమాన్ సినిమా నిర్మాతల్లో ఒకరు అయిన చైతన్య రెడ్డికి వచ్చింది. తన దృష్టిలో హనుమంతుడి పాత్రకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అయితే సరిగ్గా సెట్ అవుతారు అంటూ ఓపెన్ అయ్యారు. జై హనుమాన్ సినిమా మొత్తం హనుమంతుడితోనే ఉంటుందని, తమ హోప్స్ అన్ని కూడా హనుమంతుడి పాత్రపైనే ఉన్నాయని కూడా చెప్పారు. అయితే రామ్ చరణ్ ఫిక్స్ అయ్యాడా అనే క్లారిటీ మాత్రం ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి ఇవ్వలేదు. అంతేకాదు, హనుమంతుడి పాత్ర కోసం తమ టీం ఇంకా వెతుకుతుంది అని అన్నారు. కానీ, ఈ నిర్మాత చెప్పిన జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫిక్స్ అయితే, మెగా అభిమానులకు పూనకాలు తప్పవు.

Ram Charan As Hanuman in Jai HanuMan Movie
Ram Charan As Hanuman in Jai HanuMan Movie

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు