Karan Johar : వింత వ్యాధితో బాధపడుతున్న బడా నిర్మాత

Karan Johar : బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఎన్నో హిట్ సినిమాలను అందించారు. ఇండస్ట్రీకి ఎందరో కొత్త ముఖాలను పరిచయం చేసి, వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న ఈ నిర్మాత తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించి తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చారు.

కరణ్ జోహార్ కు అరుదైన వ్యాధి

హిందీ చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతల లిస్ట్ లో కరణ్ జోహార్ ముందు వరుసలో ఉంటారు. ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఆర్టిస్టుకు కరణ్ సినిమాలో నటించాలనే కోరిక ఉంటుంది. కరణ్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్, బ్లాక్‌బస్టర్ చిత్రాలను రూపొందించాడు. హిందీ చిత్ర సీమలో రెండు దశాబ్దాలకు పైగా దర్శక నిర్మాతగా కొనసాగుతున్నారు కరణ్. 1998లో విడుదలైన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. నేడు అతను బాలీవుడ్ పరిశ్రమలో అతిపెద్ద నిర్మాతలలో ఒకడు. అయినప్పటికీ కరణ్ ఇంత సక్సెస్ ఫుల్ కావడానికి వెనుక ఉన్న కృషి, త్యాగం గురించి మూవీ లవర్స్ కు పెద్దగా తెలియదనే చెప్పాలి.

కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చాలా మంది తారలను లాంచ్ చేసి కెరీర్ ఇచ్చాడు. అయితే నెపోటిజం ను ప్రోత్సహించినందుకు ఇప్పటికీ ఆయనపై ట్రోల్ జరుగుతూనే ఉంది. అయితే వాటన్నింటినీ పట్టించుకోకుండా ఎందరో కొత్త నటీనటుల జీవితాల్లో వెలుగు నింపిన కరణ్ జోహార్ 8 ఏళ్ల నుంచి అరుదైన వ్యాధిబాడీ డిస్మోర్ఫియాతో బాధపడుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ దర్శకుడు తన అనారోగ్యాన్ని వెల్లడించాడు.

- Advertisement -

Karan Johar reveals he deals with body dysmorphia, says it is 'very awkward getting into a pool without feeling pathetic'

బాడీ డిస్మోర్ఫియా అంటే ఏంటి?

కరణ్ జోహార్ ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్ ఫేస్ డిసౌజాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న వివిధ ఇబ్బందుల గురించి మాట్లాడాడు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల గురించి మాట్లాడుతూ తనకున్న ఒక వింత వ్యాధి గురించి బయట పెట్టాడు. కరణ్ జోహార్ 8 సంవత్సరాల వయస్సు నుండి బాడీ డిస్మోర్ఫియాతో పోరాడుతున్నట్లు పేర్కొన్నాడు. బాడీ డిస్మోర్ఫియా అనేది ఒక రకమైన మానసిక వ్యాధి. తమ గురించి తామే మనసులో ఎక్కువగా ఆలోచిస్తూ టెన్షన్ పడే మానసిక ఆరోగ్య పరిస్థితి అని చెప్పవచ్చు.

కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఈ వ్యాధి కారణంగా బయటి ప్రపంచానికి చెడుగా చూడాలంటే నేనెప్పుడూ భయపడతాను అని అన్నారు. అలాగే అతను ఎప్పుడూ వదులుగా ఉన్న బట్టలు ఎందుకు వేసుకుంటాడో కూడా రివీల్ చేశాడు. “నా గురించి నేను ఎప్పుడూ సిగ్గుపడతాను. నా శరీరభాగాన్ని ఎవరూ చూడకూడదనే ఇలాంటి బట్టలు వేసుకుంటాను. అంతేకాదు ఎంత బరువు తగ్గినా.. ఇంకా లావుగా ఉన్నట్లే అనిపిస్తుంది అలాంటి బట్టల వల్ల” అంటూ తన సీక్రెట్ ను బయట పెట్టాడు. బాడీ డిస్మోర్ఫియా నుంచి బయటపడేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించానని కరణ్ జోహార్ తెలిపారు. మందుల సాయంతో అదుపు చేసేందుకు ప్రయత్నించామని, అయినా పూర్తిగా కోలుకోలేకపోయానని చెప్పారు. రెండేళ్ల క్రితం తనకు తీవ్ర భయాందోళన వచ్చిందని కరణ్ జోహార్ తెలిపారు. ఇప్పుడు కరణ్ జోహార్ వయసు 52 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోని ఆయన సరోగసీ ద్వారా యష్, రూహి అనే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు