Samantha Controversy: డార్క్ రియాలిటీ… సమంతను టార్గెట్ చేసిన పవన్ హీరోయిన్

Samantha Controversy: కొన్ని రోజుల క్రితం సౌత్ క్వీన్ సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసిన హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకం వార్త తీవ్ర దుమారాన్ని రేపుతోంది.. రోజురోజుకూ ఈ వివాదం మరింత పెద్దదవుతుంది తప్ప తగ్గట్లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ పూనం కౌర్ డార్క్ రియాల్టీ అంటూ సమంతను టార్గెట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందిస్తూ ఏకీపారేసింది. మరి ఇంతకీ పూనమ్ రియాక్షన్ ఏంటంటే…

గుత్తా జ్వాల ఫైర్

సమంత పోస్ట్ చేసిన హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడకంపై లివర్ డాక్టర్ అని పాపులర్ అవుతున్న డాక్టర్ ఫిలిప్స్ సుదీర్ఘమైన పోస్ట్ రాస్తూ సమంతపై భగ్గుమన్నాడు. దీని వాడితే ప్రాణాలకు ప్రమాదకరమని, ఇలాంటి సెలబ్రిటీలు భారీ సంఖ్యలో ఉన్న తమ ఫాలోవర్స్ కు తప్పుడు ఆరోగ్య సలహాలు ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పైగా ఇలాంటి పని చేసినందుకు సమంతను నిరక్షరాస్యరాలిగా అభివర్ణిస్తూ డాక్టర్ ఫిలిప్స్ ఆమెను జైల్లో వేయాలని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే సమంత కూడా ఆయనకు గట్టిగానే రిప్లై ఇచ్చింది. తనకు ఈ సలహా ఇచ్చిన డాక్టర్ గత 25 ఏళ్లుగా డిఆర్డిఓ లో పని చేస్తున్నారని చెప్పింది. అయినప్పటికీ లివర్ డాక్టర్ ఏమాత్రం తగ్గకుండా ఆమె చేసింది ముమ్మాటికి తప్పే అంటూ విక్టిమ్ కార్డ్ ను ప్లే చేయడం ఆపాలంటూ ఈ వివాదాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు.

అయితే ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ వివాదమే నడుస్తుండగా సెలబ్రిటీలు సైతం సమంతపై మండిపడుతున్నారు. ఆ డాక్టర్ చెప్పిన విధానం తప్పేమో కానీ ఆయన అన్నదాంట్లో నిజం ఉందంటూ సమంతదే తప్పని వేలెత్తి చూపిస్తున్నారు. తాజాగా తమిళ హీరో విష్ణు విశాల్ భార్య, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల సమంతను సూటిగా ప్రశ్నించింది. సహాయం చేయాలనేదే మీ ఉద్దేశం అయినప్పటికీ మీరు సూచించిన ట్రీట్మెంట్ వల్ల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మీరా మీ డాక్టరా? అంటూ ఎక్కడా సమంత పేరును ప్రస్తావించకుండా ట్వీట్ చేసింది.

- Advertisement -

After Samantha, Poonam Kaur reveals a rare health condition - JAISW News

డార్క్ రియాలిటీ అంటున్న పూనమ్ కౌర్…

ఇక ఇదే ట్వీట్ కి పూనం కవర్ రిప్లై ఇస్తూ సమంతను టార్గెట్ చేసింది. ఈ హీరోయిన్ కూడా ఎక్కడా సమంత పేరును ప్రస్తావించకుండానే ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా. సెలబ్రిటీలు దేన్నైనా అడ్వటైజ్ చేస్తారు అనడానికి ఇదే ఉదాహరణ. నిజానికి చాలామంది సెలబ్రిటీలు చక్కెరను వాడరు. అలాగే చక్కెర ఉన్న కూల్ డ్రింక్స్, చాక్లెట్లను కూడా తినరు. కానీ ప్రమోషన్స్ మాత్రం చేస్తారు. ఇదంతా సెలబ్రిటీల డార్క్ రియాలిటీ అంటూ పూనమ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఇదంతా చూస్తుంటే సమంత ఇప్పట్లో ఈ వివాదంలో బయటపడేలా కనిపించడం లేదు. వివాదం సద్దుమణుగుతుంది అనుకునే లోపే ఎవరో ఒకరు దానిపై రియాక్ట్ అవుతూ దాన్ని మరింత పెద్దదిగా చేస్తున్నారు. మరి సమంత ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు