Star Couple: చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేస్తున్న స్టార్ కపుల్… పర్మనెంట్ గా అక్కడే కాపురం

Star Couple : ఇటీవల భారత క్రికెట్ జట్టు 2024 T20 ప్రపంచ కప్‌ను గెలవడంతో క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. అలాగే టీం ఇండియా జట్టుకు చిత్ర పరిశ్రమతో పాటు దేశం మొత్తం అభినందనల వర్షం కురిపించింది. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక అందమైన పోస్ట్‌ను ఆయన భార్య, నటి అనుష్క శర్మ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే విరుష్క దంపతులు పర్మనెంట్ గా విదేశాలకు మకాం మార్చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

విరాట్, అనుష్కలపై కొత్త రూమర్

గత గురువారం 2024 జూలై 4న భారత జట్టు స్వదేశానికి తిరిగి వచ్చింది. జట్టుకు ముంబైలో సక్సెస్ పరేడ్ తో ఘన స్వాగతం పలికారు. పరేడ్ ముగిసిన వెంటనే తన కుటుంబాన్ని కలవడానికి విరాట్ లండన్ బయలుదేరాడు. ఈ నేపథ్యంలోనే అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లండన్‌కు షిఫ్ట్ అవుతున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి.

గత కొన్ని నెలలుగా ఈ జంట బ్రిటన్ వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత శుక్రవారం ముంబైలో విజయోత్సవ పరేడ్ ముగిసిన వెంటనే విరాట్ తన కుటుంబాన్ని చూడడానికి లండన్ వెళ్లడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. అప్పటి నుండి అనుష్క, విరాట్ లండన్‌కు మారబోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విరాట్ బ్రిటన్ లోనే ఉండాలనే ఆలోచనలో ఉన్నాడని జనాలు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Anushka Sharma: Virat Kohli opens up about his 2-month break with Anushka Sharma, says enjoyed not being recognized | - Times of India

విరాట్-అనుష్క లండన్‌లో సెటిల్ కాబోతున్నారా?

ఇలాంటి పుకార్లు రావడంతో జనాలు రకరకాల ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు. ఓ నెటిజన్ ఇటీవలే విరాట్ లండన్ లోని ఓ ప్లే స్కూల్ ను ఫాలో అవ్వడం మొదలు పెట్టాడని, ప్రజెంట్ అక్కడే ఉండబోతున్నాడని, రిటైర్మెంట్ తరువాత పర్మనెంట్ గా అక్కడికే షిఫ్ట్ కాబోతున్నాడని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ వారు ఇక్కడ సాధారణ వ్యక్తులలాగా జీవించలేరు. ఇద్దరికీ మంచి పాపులారిటీ ఉంది కాబట్టి ప్రైవేట్ లైఫ్ జీవించడం కష్టం. 3 నుండి 4 సంవత్సరాలలో విరాట్ రిటైర్మెంట్ ప్రకటించి, కొంతకాలం అదృశ్యమవుతానని అతను ఇప్పటికే చెప్పాడు అని గుర్తు చేశారు. అయితే అది భారతదేశంలో సాధ్యం కాదు కాబట్టి బహుశా అతను లండన్లో స్థిరపడవచ్చు అంటున్నారు. ఈ రూమర్లపై విరాట్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.

రూమర్లకు ఇది కూడా ఒక కారణమా?

నిజానికి అనుష్క విరాట్ తో పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. నిర్మాతగా మారినప్పటికీ ఆమె ఎక్కువగా పర్సనల్ లైఫ్ కే టైమ్ కేటాయిస్తోంది. రీసెంట్ గా రెండవ బేబీకి అనుష్క లండన్ లోనే జన్మనిచ్చిన విషయం తెలిసిందే. చివరి నిమిషం దాకా దీని గురించి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేశారు విరుష్క దంపతులు. బిడ్డ పుట్టాక అసలు విషయాన్ని బయట పెట్టారు. ఇప్పుడు ఇదే విషయాన్ని తెరపైకి తీసుకోస్తూ అందుకే ముందుగానే ప్లాన్ చేసి బిడ్డను కూడా లండన్ లోనే కన్నారని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు