OTT Movie : మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ… చిన్న పిల్లలు చూసే మూవీ మాత్రం కాదండోయ్

OTT Movie : హాలీవుడ్ మేకర్స్ కొత్త కొత్త కథలతో ఎప్పటికప్పుడు మూవీ లవర్స్ ను థ్రిల్ చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మోస్ట్ డిస్టర్బ్బింగ్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఇందులో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు సినిమాపై సీన్ సీన్ కి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసే ట్విస్టులు, థ్రిల్లింగ్ సన్నివేశాలు కూడా అదిరిపోతాయి. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రిమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

యాపిల్ టీవీ ప్లస్ లో…

డిఫరెంట్ హారర్ మూవీని ట్రై చేయాలి అనుకునే వారికి యాపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతున్న మిడ్సమ్మర్ మూవీ బెస్ట్ ఆప్షన్. అయితే ఈ సినిమాను చూడాలి అనుకునేవారు ముందుగా కాస్త అలర్ట్ గా ఉండండి. ఎందుకంటే మోస్ట్ డిస్టర్బ్ సీన్స్ అన్నాము కదా… అవి చాలా భయంకరంగా, ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే ఇది చిన్న పిల్లలు చూసే సినిమా మాత్రం కాదు. అంతేకాదు న్యూ*డిటి కూడా బాగానే ఉంటుంది.

I Watched "Midsommar" To See If It's As Disturbing And Gross As People Are Saying, Here's How It Was

- Advertisement -

కథలోకి వెళ్తే…

హీరోయిన్ పేరు డ్యాని. ఆమెకు క్రిస్టియన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. డ్యానీ చెల్లెలు మానసిక వ్యాధి కారణంగా ఒకరోజు తన తల్లిదండ్రులను చంపేసి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో హీరోయిన్ డిప్రెషన్ ఫీల్ అవ్వగా, హీరో తన రూమ్ కి తీసుకెళతాడు. మరోవైపు హీరో ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఆ విషయం తెలిసి డ్యానీ తాను కూడా వస్తానని కోరడంతో అందరూ కలిసి బయలుదేరుతారు. అయితే ఈ ట్రిప్ హీరో క్రిస్టియన్ ఫ్రెండ్ పెల్లె ఊరికే. అక్కడ 90 ఏళ్లకు ఒకసారి జరిగే మిడ్సమ్మర్ అనే ఫెస్టివల్ చాలా ప్రత్యేకం. మొత్తానికి అందరూ ఆ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉండే వీళ్ళందరికీ డ్రగ్స్ కలిపిన ఫుడ్ ను ఇస్తారు. దీంతో అందరూ ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్లగా, హీరోయిన్ కి మాత్రం చనిపోయిన తన ఫ్యామిలీ కళ్ళ ముందు కనిపిస్తుంది.

ఆ తర్వాత లేచి చూస్తే ఊర్లో ఉన్న వాళ్లంతా ఫెస్టివల్ కోసం వైట్ ఫ్రాక్స్ వేసుకొని హడావిడిగా ఉంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్ కి దగ్గర అవ్వాలని హీరో ఫ్రెండ్ ప్రయత్నిస్తాడు. మరోవైపు అందరి కళ్ళముందే ఓ ముసలి జంట ఆ ఊరిలోని కొండపైకి వెళ్లి, అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. దీంతో హీరోయిన్ భయపడిపోతుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇది తమ సాంప్రదాయమని చెప్తారు. హీరోనేమో దీనిపై థీసిస్ చేయాలనుకుంటే, హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోదామని బలవంతం చేస్తుంది. నెమ్మదిగా హీరోయిన్ కి అక్కడ ఏదో జరుగుతోందనే విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతారు. మరి చివరికి డ్యానీ అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడిందా? మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? అనే స్టోరీని తెరపై చూస్తేనే బాగుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు