OTT Movie : యవ్వనంలో తీరని కోరికలు… 25 ఏళ్ల అబ్బాయిపై బామ్మ మోజు

OTT Movie : టైటిల్ వినగానే ఈ కాన్సెప్ట్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా. అది నిజమే సమంత నటించిన ఓ బేబీ సినిమా కాన్సెప్ట్ దీనికి సింక్ అవుతుంది. కానీ నిజానికి ఆ మూవీ స్టోరీ వేరు ఈ మూవీ స్టోరీ వేరు. పైగా ఇదొక హాలీవుడ్ బో*ల్డ్ మూవీ. ఓ బేబీ మూవీలో సమంత యంగ్ ఏజ్ లోకి మారిన తర్వాత నాగశౌర్య ప్రేమలో పడుతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఏకంగా బామ్మ వయసున్న ఆవిడ 25 ఏళ్ల అబ్బాయిపై మోజూ పడుతుంది. మరి ఇంతకీ ఈ సరికొత్త కంటెంట్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ప్రేమ గుడ్డిది, వయసుతో సంబంధం లేదు అంటూ ఉంటారు. ఇటీవల కొంతమంది సెలబ్రిటీల ప్రేమాయణం చూస్తుంటే అది కూడా నిజమే అనిపిస్తుంది. కానీ ప్రేమంటే కేవలం చూసుకోవడంతో సరిపోదు. ఫిజికల్ నీడ్స్ కూడా ఉంటాయి. అంటే శృం*గారానికి మాత్రం ఆ వయసుతో కచ్చితంగా సంబంధం ఉంటుంది. ఒకానొక ఏజ్ దాటితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా శృం*గార కోరికలు తగ్గిపోతాయి. అందుకనేమో పెద్దలు ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలి అంటూ చెప్తారు. ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బోల్డ్ మూవీ లో బామ్మ లేట్ వయసులో ఘాటు రొమాన్స్ కోరుకుంటుంది. ఈ మూవీ పేరు గుడ్ లక్ టు యు లియో గ్రాండ్. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇక ఈ మూవీని చూడాలి అనుకునేవారు అందులో బో*ల్డ్ సన్నివేశాలు ఉన్నాయని విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

OTT Movie: 25 ఏళ్ల కుర్రాడితో బామ్మ.. యవ్వనంలో తీరని కోర్కెలను..!

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక బామ్మ చుట్టూనే తిరుగుతుంది. భర్తతో సంతృప్తిగా ఉన్నట్టుగా నటించిన ఈ బామ్మ అతను చనిపోయాక ఇప్పటికైనా లైఫ్ ను ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ప్రత్యేకంగా ఆ కోరికలు తీర్చుకోవడానికి ఒక సె*క్స్ వర్కర్ ని పిలిపించుకుంటుంది. ఇంట్లో కాకుండా హోటల్లో ప్రోగ్రాం పెట్టుకుంటుంది. ఆమె పేరు నాన్సీ, ఆ సె*క్స్ వర్కర్ పేరు లియో గ్రాండ్. అయితే తనకంటే చాలా తక్కువ వయసున్న అతన్ని చూసిన తప్పు చేస్తున్నానని ఫీలవుతుంది ఈ బామ్మ. ఎందుకంటే ఈమెకు ఏమో 60 ఏళ్లకు పైగానే వయసు ఉంటుంది. అతను 25 ఏళ్ల యువకుడు. ఆల్మోస్ట్ మనవడి ఏజ్ ఉంటుంది అతనికి. కానీ ఆ అబ్బాయి మాత్రం ఇదేం పెద్ద తప్పు కాదు అంటూ ఆమెను ఎంకరేజ్ చేస్తాడు. మొత్తానికి ఇద్దరు కలిసి అనుకున్న పని చేసేస్తారు. ఇక బామ్మ కోరిక కూడా తీరుతుంది. కానీ అసలు ట్విస్ట్ అక్కడే మొదలవుతుంది. కోరిక తీరిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఆ యువకుడు ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్కెయ్యండి. కానీ సింగిల్ గా చూస్తే బెటర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు