Kalki2898AD : కల్కి రన్ టైం ని తగ్గించిన మేకర్స్.. ఎందుకంటే?

Kalki2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా థియేటర్ల వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. విడుదలైన మొదటి రోజు నుండి రికార్డులు కొల్లగొడుతూ మంచి థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తోంది. ప్రభాస్ సహా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి పాన్ ఇండియా భారీ తారాగణం ఈ సినిమాలో నటించడం వల్ల అన్ని భాషల్లో కూడా కల్కి కి భారీ ఓపెనింగ్స్ రావడం జరిగింది. ఇక కల్కి సినిమా విడుదలైన మొదటి రోజు నుండే వంద కోట్ల ఓపెనింగ్స్ స్టార్ట్ చేసి వీకెండ్ ముగిసే దాకా రోజు వంద కోట్లు రాబట్టడం విశేషం. ఇక వర్కింగ్ డేస్ లో కూడా కల్కి జోరు చూపించి కేవలం తొమ్మిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావడం జరిగింది. ఇక కల్కి పదో రోజు మళ్ళీ వీకెండ్ తో రెట్టించిన జోరుతో హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అవుతుందని చెప్పాలి. ఇదిలా ఉండగా కల్కి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

Kalki2898AD Movie's Run Time Cut Down by Makers in Overseas

రన్ టైం తగ్గించిన మేకర్స్.. ఎందుకంటే?

అయితే కల్కి2898AD (Kalki2898AD) సినిమా ఫస్ట్ వీక్ తర్వాత మంచి కల్లెక్షన్లనే నమోదు చేస్తున్నా, టాక్ పరంగా చూస్తే తక్కువే అని చెప్పాలి. పైగా రెండో వారంలో అడుగుపెట్టేసరికి టికెట్ రేట్లు నార్మల్ అయ్యాయి. దానివల్ల కలెక్షన్లలో షేర్ పెర్సెంటేజ్ తక్కువవుతుంది. అయితే తాజాగా కల్కి సినిమా రన్ టైం ని తగ్గించారు మేకర్స్. కానీ మీరనుకున్నట్టు ఇండియాలో కాదు. అది ఓవర్సీస్ లో. అవును.. కల్కి సినిమా కాస్త ల్యాగ్ ఎక్కువైంది అని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఓవర్సీస్ లో ప్రేక్షకుల సౌలభ్యం కోసం అక్కడ మూడు గంటల నిడివి ఉన్న కల్కి రన్ టైం ని 2 గంటల 45 నిమిషాలకు తగ్గించారు. కల్కి సినిమా ఇండియాకి ధీటుగా ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు రాబడుతున్న నేపథ్యంలో ఓవర్సీస్ లో కల్లెక్షన్లు తగ్గకూడదని అనుకున్న మేకర్స్, ప్రేక్షకులకు ల్యాగ్ ఫీలింగ్ రాకుండా పదిహేను నిముషాలు ట్రిమ్ చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

వెయ్యి కోట్ల దిశగా కల్కి..

అయితే కల్కి సినిమాలో రన్ టైం ని తగ్గిస్తే.. బహుశా ఫైట్ సీన్లలో కొంచెం, అలాగే RGV స్పెషల్ అప్పీరెన్స్ సీన్లు ట్రిమ్ చేసి ఉంటారని సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో కల్కి సినిమా ఇప్పటికే 800 కోట్లకు కలెక్షన్లకు చేరువగా రాగా, వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. అయితే రెండో వారం ముగిశాక, అంటే జులై 12న ఇండియన్2 సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి, ఆ సినిమా టాక్ ని బట్టి లాంగ్ రన్ లో కల్కి ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అని ఒక అంచనాకు రావచ్చు. ఇక ఇండియన్2 తెలుగులో భారతీయుడు2 పేరుతో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక కల్కి ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి అడుగుపెట్టగా, దాదాపు థియేట్రికల్ రన్ ద్వారా వంద కోట్ల లాభాలను అందుకునే ఛాన్స్ ఉంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు