7 Years For Ninnu Kori: ఉమా పల్లవి ప్రేమకు నేటికీ ఏడేళ్ళు

7 Years For Ninnu Kori: నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాని కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిలో కూడా నిన్ను కోరి సినిమా ప్రత్యేకమని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఉమామహేష్ అనే పాత్రలో కనిపిస్తాడు నాని. నివేత థామస్ ఈ సినిమాలో పల్లవి అనే పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అయింది దాదాపు 52 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఇదే సినిమాను తమిళ్లో తల్లి పోగాదే పేరుతో రీమేక్ చేశారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఉమామహేశ్వరరావు వైజాగ్ యూనివర్సిటీ స్టూడెంట్. అయితే అదే కాలేజీలో పల్లవి అనే ఒక అమ్మాయి చదువుకుంటుంది. పల్లవికి డాన్స్ నేర్చుకోవాలని కోరిక ఉంటుంది. అయితే ఉమామహేశ్వరరావు మంచి డాన్సర్ కావడంతో తన వద్ద డాన్సర్ గా చేరుతుంది. ఆ తర్వాత ఉమా మహేశ్వరరావు పల్లవి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఉమామహేశ్వరరావు పల్లవి వాళ్ళ ఇంటి పెంట్ హౌస్ లో రెంటుకు దిగుతాడు.

ఆ తర్వాత పల్లవి కుటుంబ సభ్యులతో కూడా కలిసిపోతాడు. ఇక అన్ని సక్రమంగా జరుగుతున్న టైంలో ఢిల్లీ యూనివర్సిటీలో పిహెచ్డి చేయడం కోసం పల్లవిని వదిలి వెళ్తాడు ఉమామహేశ్వరరావు. ఈ లోపు పల్లవికి పెళ్లి జరిగిపోతుంది. పల్లవి అరుణ్ అమెరికాలో సెటిల్ అవుతారు. పిహెచ్డి పూర్తి చేసుకున్న ఉమా కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తాడు. ఒక దశలో బాధతో ఉద్యోగం వదిలేసి ఉమా తాగుడుకు బానిస అవుతాడు. ఉమా గురించి తెలుసుకున్న పల్లవి అరుణ్ ను ఒప్పించి ఇంట్లోకి తీసుకొస్తుంది ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా కథ.

- Advertisement -

Ninnu Kori

ఈ సినిమాకి కోన వెంకట్ అందించిన స్క్రీన్ ప్లే పెద్ద ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు శివ నిర్వాణ. ఈ సినిమాను డి వి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఆది పినిశెట్టి మురళీ శర్మ తనికెళ్ల భరణి కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపించారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకి నేటికీ ఏడేళ్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు