Kiran Abbavaram: గాయపడిన సింహం నుంచి వచ్చిన శ్వాస, నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్

Kiran Abbavaram: షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. రవికిరణ్ కోలా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత కిరణ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ సినిమా తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం అనే సినిమాను చేశాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అయితే కేవలం ఈ సినిమాలో నటుడు గానే కాకుండా తనలో ఉన్న రచయితను కూడా బయటకు తీశాడు. ఈ సినిమా మంచి హిట్ అవడంతో కిరణ్ కి అవకాశాలు వచ్చాయి.

ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం చాలా సినిమాలను చేశాడు. పెద్దపెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని మరి సినిమాలు చేశాడు. అయితే ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా తర్వాత చేసిన ఏ సినిమా కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం ఏ సినిమా చేసినా కూడా అన్ని సినిమాల్లో ఒకేలా కనిపిస్తాడు అంటూ ట్రోల్స్ కూడా వినిపించాయి.

ఇకపోతే కిరణ్ నటించిన చివరి సినిమా రూల్స్ రంజన్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఏం రత్నం కుమారుడు దర్శకత్వం వహించిన సినిమా కనీసం అంచనాలను కూడా అందుకోలేకపోయింది. ఇకపోతే రీసెంట్ గా కిరణ్ అబ్బవరం తన తదుపరి సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి దాదాపు 20 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. కిరణ్ కెరియర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. అయితే ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కొంతమంది ట్రోలింగ్ మొదలుపెట్టి గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస అంటూ డైలాగ్స్ రాసుకుంటూ వస్తున్నారు.

- Advertisement -

Title Announcement of Kiran Abbavaram

ఇక అనౌన్స్మెంట్ చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది అని చెప్పొచ్చు. ఒక పోస్ట్ కార్డు పై సబ్ ఇన్స్పెక్టర్ కి రాసిన అడ్రస్ తో ఫ్రొం అభినయ వాసుదేవ్ అని మనం గమనించవచ్చు. బహుశా ఇది కిరణ్ క్యారెక్టర్ పేరు కావచ్చు. ఈ సినిమాను శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్ కే ఏ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్ జులై 9న అనౌన్స్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు