Sai Dharam Tej: మృగాల నుంచి పిల్లల్ని కాపాడండి.. రెండు రాష్ట్రాల సీఎంలకు అభ్యర్థన..!

Sai Dharam Tej.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళితే.. గత కొన్ని రోజులుగా.. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం అన్న పేరుతో ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో కొంతమంది బిహేవ్ చేస్తున్నారు.. సెలబ్రిటీలు, సామాన్యులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై బూతులు , నెగిటివ్ కామెంట్లు డబుల్ మీనింగ్ డైలాగ్లతో రెచ్చిపోతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు మార్ఫింగ్ అనే దరిద్రం కూడా ఇప్పుడు ఎక్కువయింది.. ఇప్పుడు వీటిపై సాయి ధరంతేజ్ రియాక్ట్ అయ్యారు.. సోషల్ మీడియాలో ఉన్న మృగాల నుంచి పిల్లలను కాపాడుకోవాలంటూ అటు తల్లిదండ్రులకు పిలుపునివ్వడమే కాదు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, డిప్యూటీ ముఖ్యమంత్రులకు తన పోస్ట్ ద్వారా రిక్వెస్ట్ చేశారు సాయి ధరంతేజ్..

Sai Dharam Tej: Save children from beasts.. Request to CMs of two states..!
Sai Dharam Tej: Save children from beasts.. Request to CMs of two states..!

తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త..

తాజాగా మూడు గంటల క్రితం సాయి ధరంతేజ్.. సోషల్ మీడియా ప్రపంచం అత్యంత క్రూరంగా మారిపోయింది.. దీనిని నియంత్రించడం చాలా కష్టం.. కాబట్టి మీరు మీ పిల్లల వీడియోలు లేదా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి కాస్త ఆలోచించండి.. ఇది తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి . లేకుంటే సోషల్ మీడియాలో ఉండే కొంతమంది మృగాలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు.. దయచేసి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి.. సోషల్ మీడియాలో నీచంగా ప్రవర్తించే మృగాళ్ళకి ఎప్పటికీ కూడా భాదిత పిల్లల తల్లిదండ్రులకు క్షోభ అర్థం కాదు.. తల్లిదండ్రులారా మీరే జాగ్రత్త తీసుకోవాలి.. అంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

రెండు ప్రభుత్వాలకు అభ్యర్థన..

అయితే ఇప్పుడు ప్రభుత్వాలను కూడా తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా ట్యాగ్ చేస్తూ ఈ విషయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాక్, స్వేచ్ఛ స్వాతంత్రం పేరుతో చాలామంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు.. ఇలాంటి వికృత చర్యలకు పాల్పడే మృగాల నుంచి పిల్లల్ని కాపాడడం కోసం ప్రభుత్వాలు నడుము కట్టాలి. దయచేసి పిల్లల జీవితాలను అతలాకుతలం చేయాలనుకునే సోషల్ మీడియాలో ఉండే కొంతమంది మృగాలకు మీరు చట్టరీత్యా తగిన బుద్ధి చెప్పాలి అంటూ కోరారు.. అంతేకాదు చివరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ లను ట్యాగ్ చేస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

- Advertisement -

అందరినీ అలర్ట్ చేస్తున్న సాయిధరమ్ తేజ్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి అంటే తల్లిదండ్రులు ఒకటే పోరాడితే సరిపోదు ప్రభుత్వాలు కూడా దిగి రావాలి.. అధికారులు ఇలాంటి వారిని పట్టుకుని శిక్షించాలి .. ఇలాంటి వారి పట్ల కఠినంగా ప్రవర్తించాలి అంటూ సోషల్ మీడియా మృగాలపై షాకింగ్ కామెంట్లు చేశారు సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారడమే కాదు అందరినీ అలర్ట్ చేస్తున్నాయని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు