Prabhas.. సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే దర్శకులు ఒక హీరో లేదా ఒక హీరోయిన్ దృష్టిలో పెట్టుకొని కథ రాస్తూ ఉంటారు. అయితే ఆ కథలు వారితోనే తెరకెక్కించాలని కూడా ఆరాటపడతారు కానీ ఒక్కొక్కసారి వారితోనే ఆ సినిమా తెరకెక్కితే.. మరొకసారి కొన్ని కారణాలవల్ల ఆ హీరోలు రిజెక్ట్ చేయడంతో ఆ కథలు వేరే హీరోలను చేరుతూ ఉంటాయి. అలా చేరిన ఆ కథలు తెరపై కనిపించిన తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా దక్కించుకుంటూ ఉంటాయి. మరొకసారి డిజాస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలా తమ అభిమాన హీరోలు మిస్ చేసుకున్న సినిమాలు ఒకవేళ బ్లాక్ బాస్టర్ హిట్ కొడితే.. అయ్యో మా హీరో మిస్ అయ్యాడే అని అభిమానులు బాధపడతారు.. ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే మిస్ అవ్వడమే మంచిది అంటూ కామెంట్లు చేస్తారు.. ఏది ఎలా ఉన్నా సరే సినిమా కథలు మాత్రం ప్రేక్షకులను మెప్పించాలి.. ఇదిలా ఉండగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కొన్ని బ్లాక్ బాస్టర్ హిట్ మూవీలను వదులుకోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.. అయితే ఒక్క చిత్రానికి ఒక్కో రకమైన కారణం కూడా ఉంది. మరి ప్రభాస్ వదులుకున్న ఆ బ్లాక్ బస్టర్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఒక్కడు:
మహేష్ బాబు నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా కథను మొదట ప్రభాస్ కి వినిపించారు డైరెక్టర్ గుణశేఖర్.. అయితే కాన్సెప్ట్ రిస్క్ గా ఉందని భావించిన ప్రభాస్ స్క్రిప్ట్ ను తిరస్కరించాడు.
బృందావనం:
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. సమంత, కాజల్ అగర్వాల్ హీరోయిన్ లుగా నటించిన చిత్రం బృందావనం .ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా కథను కూడా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ప్రభాస్ కి వినిపిస్తే.. ఆ సమయంలో ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల సినిమాను రిజెక్ట్ చేశారు.
దిల్:
నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమా ఆఫర్ ను మొదట ప్రభాస్ కు ఇచ్చారు ప్రముఖ డైరెక్టర్ ఇంద్ర కుమార్.. కానీ ఇంకో సినిమాతో బిజీగా ఉండడం వల్ల ప్రభాస్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
ఆర్య:
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మొదట ఈ సినిమాను ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని కథ రాశారట . కానీ ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చలేదని ప్రభాస్ రిజెక్ట్ చేశారు.. ఇదే సినిమాను అల్లు అర్జున్ చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
డాన్ శీను:
రవితేజ హీరోగా నటించిన డాన్ శీను కథ మొదట ప్రభాస్ దగ్గరకు వెళ్ళింది. అయితే ప్రభాస్ ఈ కాన్సెప్టు నచ్చలేదని రిజెక్ట్ చేశారు.. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా 100 రోజులు థియేటర్లలో దిగ్విజయంగా పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది.
నాయక్:
వివి వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా నాయక్. ఈ సినిమా కథ కూడా మొదట ప్రభాస్ దగ్గరకు వెళ్తే ..ప్రభాస్ మిర్చి సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
జిల్:
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన చిత్రం జిల్.. ఈ సినిమా కథ కూడా ప్రభాస్ దగ్గరకు ముందుగా వెళితే ఆయన బాహుబలి సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు.
ఊసరవెల్లి:
ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ఊసరవెల్లి… ఈ సినిమా కథ కూడా ప్రభాస్ కి మొదట వినిపించినా.. ఆయన తిరస్కరించారు.
కిక్:
రవితేజ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం కిక్.. ఈ సినిమా కథను కూడా సురేందర్ రెడ్డి ముందుగా ప్రభాస్ కు వినిపిస్తే.. ప్రభాస్ ఈ సినిమా కథపై దృష్టి పెట్టలేకపోయారు.. ఫలితంగా రిజెక్ట్ చేశారు.
సింహాద్రి:
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా కూడా మొదట ప్రభాస్ వద్దకు చేరింది.. ప్రభాస్ తనకు మాస్ గెటప్ సరిపోదని అప్పట్లో చెప్పి రిజెక్ట్ చేశారు.
ఇలా ఈ చిత్రాలన్నీ కూడా ప్రభాస్ వదులుకోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.