Indian 2: అందుకే ఇండియన్ 2 సినిమాకి రెహమాన్ కు బదులుగా అనిరుద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్న

Indian 2: తమిళ్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో హిట్స్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు శంకర్. 17 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత జెంటిల్మెన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ తర్వాత ఎన్నో హిట్ హిట్ సినిమాలు చేశారు శంకర్. శంకర్ కెరియర్ లో వచ్చిన సినిమాలు అన్నిట్లో కూడా భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లంచం కాన్సెప్ట్ లో తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

భారతీయుడు 2 సినిమాని శంకర్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. సినిమా ఆగిపోయే పరిస్థితి కూడా ఆల్మోస్ట్ వచ్చింది. సినిమా జరుగుతున్న సమయంలో ఫైర్ ఆక్సిడెంట్ జరగడం దాని వలన అసిస్టెంట్ డైరెక్టర్స్ చనిపోవడం ఇలా ఎన్నో అవంతరాలు ఈ సినిమాకు వచ్చాయి. ఈ సినిమా దాదాపు ఆగిపోతుంది అని అనుకున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. లైకా ప్రొడక్షన్స్ తో పాటు దిల్ రాజు కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం ఉన్నారు. అయితే సినిమా లేట్ అవుతున్న కొద్ది ఈ సినిమా నుంచి దిల్ రాజు తప్పుకొని, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అదే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కించాడు.

INDIAN 2

- Advertisement -

అయితే ఈ సినిమాను జూలై 12న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అనేక ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది. అయితే ఏఆర్ రెహమాన్ శంకర్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకి మంచి మ్యూజిక్ అందించారు. అపరిచితుడు సినిమా మినహాయిస్తే శంకర్ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఇండియన్ టూ కి ఏ ఆర్ రెహమాన్ ను ఎందుకు తీసుకోలేదు అనే ఒక ప్రశ్నను జర్నలిస్ట్ వేశారు. దానికి సమాధానంగా శంకర్ మాట్లాడుతూ ఇండియన్ 2 సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం చేయకపోవడానికి కారణం ఏంటంటే ఈ సినిమా జరుగుతున్న టైంలో రోబో 2.0 సినిమాకి రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. అందుకోసం ఈ సినిమా చేయటం కుదరలేదు. నాకు యువన్ శంకర్ రాజా, సంతోష్ నారాయణ, హరీష్ జయరాజ్ సాంగ్స్ కూడా చాలా ఇష్టం. అలానే అనిరుద్ మ్యూజిక్ నచ్చడంతో ఇండియన్ టు సినిమాకి అనిరుధ్ తీసుకున్నాను. అని శంకర్ చెప్పాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు