Sj Surya: పవన్ కళ్యాణ్ సీఎం అని నేను మూడు సంవత్సరాల క్రితమే చెప్పాను

Sj Surya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమాల్లో మంచి ప్లేస్ సాధించుకున్న పవన్ కళ్యాణ్ 2014లో జనసేన అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే అప్పటికి కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోవడం వలన ఆ పరిస్థితుల్లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ పోటీలో దిగకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ గా నిలిచాడు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి 2014లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు.

లేకపోతే 2019వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశాడు. అయితే పోటీ చేసిన రెండు చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అక్కడితో పవన్ కళ్యాణ్ ని చాలామంది టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2019లో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీలో ఉన్న చాలా మంది ప్రముఖులు పవన్ వ్యక్తిగత జీవితం మీద కూడా విమర్శలు చేశారు. చాలా తక్కువ మనదే మళ్లీ 2024 లో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు అని బిలీవ్ చేశారు.

Pawan Kalyan

- Advertisement -

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి అనే సినిమా ఎస్ జె సూర్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఇకపోతే మళ్లీ పవన్ కళ్యాణ్ తో కొమరం పులి అనే సినిమాను కూడా చేశాడు కానీ ఆ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎస్ జే సూర్య మాట్లాడుతూ ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాను అని అన్నారు. రీసెంట్ గా ఇండియన్ టు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హాజరైన ఎస్ జె సూర్య ఈ మాటలను గుర్తు చేసుకుంటూ ఒక రోజు నేను ఇలా చెప్పాను అది సగం నెరవేరింది. మిగతా సగం మీరే నిర్ణయించాలి అంటూ పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ గా సీఎం చేసే బాధ్యత మీ మీదే ఉంది అని తన ఉద్దేశాన్ని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు