Bharateeyudu2 : ఆహార్యంతో కమల్ ని పూర్తిగా దించేసిన బ్రహ్మీ..!

Bharateeyudu2 : ఉలగనయగన్ కమల్ హాసన్ నటించిన ఇండియన్2 సినిమా ఎట్టకేలకు వచ్చేవారం జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఇండియన్2 శంకర్ షణ్ముగం కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కగా, ఈ సినిమా తెలుగులో భారతీయుడు2 పేరుతో విడుదల కానుంది. ఇదిలా ఉండగా భారతీయుడు2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగడం జరిగింది. ఈ ఈవెంట్ కి కమల్ హాసన్ సహా చిత్ర యూనిట్ మొత్తం హాజరవడం జరిగింది. ఇక ఈ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా రావడం జరిగింది. అయితే బ్రహ్మానందం చాలా రోజుల తరవాత ఒక సినిమా ఈవెంట్ కి రావడం జరిగింది. అయితే భారతీయుడు2 (Bharateeyudu2) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడిన స్పీచ్ వైరల్ గా మారింది.

Bramhanandam Speech At Bharateeyudu2 Pre Release Event

చదువుకునే రోజులనుండి ఆయన్ని చూస్తున్నా..

ఇక భారతీయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం స్పీచ్ వైరల్ అవగా, ఆయన మాట్లాడుతూ.. కమల్ హాసన్ ఏజ్ గురించి నాకు తెలీదు గాని.. చదువుకునే రోజులనుండి చూస్తూనే ఉన్నాను.. సాగర సంగమం లో ఆయన నటించిన విధానం చూస్తే.. ఆయన శరీరం మొత్తం ఎంత వరకు ఆయన ఆక్ట్ చేయమని చెప్తే.. అంత వరకే చేసేలా పర్ఫెక్ట్ కెపాసిటీ ఉన్న ఆక్టర్ ఆయన.. అని చెప్పుకొచ్చారు. అలాగే శంకర్ లాంటి దర్శకుడు, కమల్ హాసన్ గారి వంటి నటుడుతో పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు.

- Advertisement -

కమల్ ని దించేసి బ్రహ్మీ…

అయితే స్పీచ్ ముగించే ముందు బ్రహ్మానందం కమల్ హాసన్ ని ఇమిటేట్ చేస్తూ, ఆయన్నీ మిమిక్రి చేయడం హైలెట్ గా మారింది. కమల్ హాసన్ లాగా బ్రహ్మానందం మాట్లాడుతూ… ఇలా చెప్పుకొచ్చారు. అందరికి నమస్కారం.. నేను భారతీయుడు2లో యాక్ట్ చేశాను.. అప్పుడు భారతీయుడు ని హిట్ చేసారు. మీ అందరికి తెలుసు. ఇక ఈ సినిమాకి అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను. మన సౌత్ ఇండియన్స్ అందరూ నన్ను ఎంతో ఆశీర్వదించారు. నాకు మాటలు ఎక్కువగా రావడంలేదు. చాలా సంతోషంగా ఉంది. ఈ భారతీయుడు2 ని కూడా సక్సెస్ చేస్తే ఐ విల్ బి హ్యాపీ… అంటూ బ్రహ్మానందం స్పీచ్ ముగించారు. ఈ మిమిక్రి చూస్తే.. అచ్చం కమల్ హాసనే మాట్లాడారు అనిపించక మానదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు