Prashanth Varma : ప్రశాంత్ వర్మ సెటైరికల్ ట్వీట్… ఆ స్టార్ హీరో వల్ల బాగానే ఇబ్బంది పడ్డాడు

Prashanth Varma : టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫేమ్ సంపాదించాడన్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా పలు ఆఫర్లు క్యూ కట్టాయి. “అ”, జాంబీ రెడ్డి వంటి చిత్రాలతో తనని తాను ప్రూవ్ చేసుకున్న ప్రశాంత్ వర్మ.. ఏ ముహూర్తాన హనుమాన్ సినిమా మొదలుపెట్టాడో కానీ, చిన్న సినిమాగా విడుదలై టాలీవుడ్ సత్తా ఏంటో నేషనల్ వైడ్ గా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలకి విపరీతంగా నచ్చేసింది మన హనుమాన్ మూవీ. పైగా హనుమాన్ సినిమా తర్వాత టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు ప్రశాంత్ వర్మతో సినిమా తీయడానికి క్యూ కట్టారు. అంతకు మించి స్టార్ హీరోలు కూడా ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ చేస్తాడనుకున్నా, ఆ సినిమాకి ముందు మరో సినిమా చేస్తానని అన్నాడు. అయితే బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ని కథ వినిపించగా, హనుమాన్ డైరెక్టర్ కాబట్టి వెంటనే ఒకే కూడా చెప్పినట్టు, అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ప్రశాంత్ వర్మ వేసిన ట్వీట్ తో సినిమా ఆగిపోయిందన్న అనుమానాలు మొదలయ్యాయి.

Prashant Varma's satirical tweet on Ranveer Singh

ప్రశాంత్ వర్మ సెటైరికల్ ట్వీట్..

అయితే ప్రశాంత్ వర్మ తాజాగా వేసిన ట్వీట్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ప్రశాంత్ వర్మ ఓ స్టార్ హీరోని ఉద్దేశిస్తూ సెటైరికల్ గా ట్వీట్ వేసినట్టు తెలుస్తుంది. అయితే అది రణవీర్ సింగ్ ని ఉద్దేశించిందే అని సమాచారం. అయితే కొన్ని రోజుల కిందే అనధికారంగా ఫిక్స్ అయిన రణవీర్ సింగ్ – ప్రశాంత్ వర్మ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుందని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని అన్నారు. కానీ లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ వేసిన ట్వీట్ తో రణవీర్ సినిమా రిజెక్ట్ చేసాడని టాక్ నడుస్తుంది. క ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ లో ఇలా చెప్పుకొచ్చాడు… ‘ఒక రోజు మీరు ప్రతి రిజెక్షన్ ని వేరే రూపంలో ఒక ఆశీర్వాదం అని తెలుసుకుంటారు’! అని ఇంగ్లీష్ లో ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. అయితే చాలా మంది రణవీర్ సింగ్ కథ నచ్చక రిజెక్ట్ చేసినందుకే ఈ ట్వీట్ వేశాడని అంటున్నారు.ఆ ట్వీట్ చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది. అయితే ఇదే నిజమైతే రణవీర్ సింగ్ మంచి కథని మిస్ అవుతాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

మరి ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్?

ఇక రణవీర్ సింగ్ (Prashanth Varma) ముందు కథ ఒకే చేసి, తర్వాత రిజెక్ట్ చేయడం కూడా సరికాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ వేసిన ట్వీట్ రణవీర్ సింగ్ రిజెక్ట్ చేయడంపైనే అయితే, మరి తన నెక్స్ట్ సినిమా ఏంటి అన్న చర్చ నడుస్తుంది. అయితే కొందరు నెటిజన్ల అభిప్రాయం ప్రకారంహోల్డ్ లో పెట్టిన అధిరా, లేదా హనుమాన్ సీక్వెల్ చేయొచ్చని, లేదా మరో కొత్త హీరోతో సినిమా చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు