Kerintha: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కేరింత భావన.. హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా..?

Kerintha.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న నటీనటులు సైతం చాలామంది ఉన్నారు.. ముఖ్యంగా చిన్న, పెద్ద అనే సినిమా తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు కూడా ఎలాంటి సినిమా నైనా సరే ఆదరిస్తారని ఎన్నోసార్లు నిరూపించారు. అలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలు దక్కించుకున్న చిత్రాలు ఉండడమే కాకుండా.. యువతను ఆకట్టుకునే కథతో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలు కూడా వున్నాయి. అలాంటి వాటిలో కేరింత సినిమా కూడా ఒకటి.. దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ సాయికిరణ్ అడవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Kerintha: Kerintha Bhavana, who has changed beyond recognition.
Kerintha: Kerintha Bhavana, who has changed beyond recognition.

ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కేరింత భావన..

ముఖ్యంగా ఇందులో చాలామంది నటీనటులు సైతం నటించారు. సంగీతం కూడా మిక్కీ జే మేయర్ అందించడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రంలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి సుకృతి అంబటి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా ఈ చిత్రంలో పార్వతీశంకు జోడీగా నటించి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో నటించింది. కేరింత సినిమా తర్వాత ఆమె పెద్దగా మరే సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఈమెకు వివాహమై ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది.

భావన అసలు పేరు సుకృతి అంబటి..

కేరింత చిత్రంలో భావన అనే పాత్రలో చక్కటి పల్లెటూరి అమ్మాయిగా నటించిన సుకృతి.. తన చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలోని ఎక్కువగా పెరిగిందట.. ఈమె చదువు కూడా ఢిల్లీలో రాజు స్కూల్లో చదువుకున్న తర్వాత.. రాజస్థాన్లో వనస్థలి యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిందట. సినిమాలలో అనుకోకుండా అవకాశం రావడంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగయ్యింది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడు.. తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సుకృతి..

సుకృతి తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే చాలా స్టైలిష్ గా మారిపోయి మరీ కనిపిస్తోంది. అయితే కేరింత సినిమా చూసినవారు ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఆశ్చర్యపోతారు.. గతంలో చాలా పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుత ఫోటోలలో చాలా హాట్ గా కనిపిస్తోంది. అలాగే తన భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు అయితే వైరల్ గా మారుతున్నాయి.

ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందా..

ఇకపోతే అప్పట్లో కంటే ఇప్పుడు మరింత స్టైలిష్ గా మారిపోయిందని.. హాట్ గా గ్లామర్ వలకబోస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే తన అంతంతో అందర్నీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.. మరి ఇప్పుడైనా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా..? లేక వైవాహిక జీవితానికే కెరియర్ ను అంకితం చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు