Game Changer: మొత్తానికి ప్రొడక్షన్ హౌస్ నుంచి గేమ్ చేంజర్ అఫీషియల్ అప్డేట్

Game Changer: దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన హిట్ సినిమా లను ఇండస్ట్రీకి అందించాడు శంకర్. ఇప్పుడు అంతా పాన్ ఇండియా హవా నడుస్తున్న సమయంలో, అప్పట్లోనే పాన్ ఇండియా సబ్జెక్టులను డీల్ చేసిన ఘనత శంకర్ కి ఉంది. శంకర్ చేసిన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతూ రిలీజ్ అయింది. శంకర్ తో పని చేయాలని చాలామంది హీరోలు ట్రై చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.

శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ రోబో అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు అతిథులుగా హాజరయ్యారు. ఆ సందర్భంలో మెగాస్టార్ ను ఉద్దేశిస్తూ రజనీకాంత్ శంకర్ చాలా మంచి దర్శకుడు మీరు కచ్చితంగా శంకర్ తో సినిమా చేయాలి అని అన్నారట. అయితే రజిని తో నాకు ఒక ప్రాజెక్ట్ సెట్ చెయ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పటిలో శంకర్ తో పనిచేయాలని అనుకున్నారట. కానీ ఇది వర్కౌట్ కాలేదు.

Ram Charan

- Advertisement -

మొత్తానికి త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. మెగాస్టార్ చిరంజీవి శంకర్ తో సినిమా చేయలేకపోయినా కూడా తనయుడు చరణ్ చేసే అవకాశం వచ్చింది. దాదాపు నాలుగు ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అప్డేట్స్ కూడా సరిగ్గా ఇచ్చేది కాదు. ఈ ప్రాజెక్టు తో పాటు మరోవైపు భారతీయుడు 2 సినిమాను కూడా డీల్ చేశాడు శంకర్. ఎట్టకేలకు అధికారికంగా గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయిందని అలానే ఇంకా ముందు ముందు మంచి అప్డేట్స్ ఈ సినిమా గురించి రానున్నట్లు కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు