Bollywood Hero: మరణాన్ని ముందే ఊహించారా..ఆ కుంటుంబంలో ఎవరూ 50 యేళ్ళకు మించి..!

Bollywood Hero: జీవితం అంటే నాలుగు దఫాలు.. బాల్యం, యుక్త వయసు , మద్యస్థ జీవితం, వృద్ధాప్యం.. అన్నింటిని మనం రుచి చూడగలిగినప్పుడే జీవితం ఏంటో అర్థం అవుతుంది.. అయితే ఇక్కడ ఒక బాలీవుడ్ హీరో కుటుంబంలో మాత్రం ఎవరూ వృద్ధాప్యాన్ని చూడలేదంటే అతిశయోక్తి కాదు.. వీరంతా కూడా 50 ఏళ్లకు మించి జీవించలేదు.. మరణాన్ని ముందే ఊహించారో ఏమో అందరూ కూడా 50 ఏళ్లలోపే మరణించడం బాధాకరమని చెప్పాలి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని.. ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఒక బాలీవుడ్ హీరో.. కెరియర్ ఫామ్ లో ఉన్నప్పుడే గుండెపోటుతో 47 ఏళ్ల వయసులోనే మరణించి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. ఆయన ఎవరో కాదు సంజీవ్ కుమార్..

Bollywood Hero: Did you foresee death..No one in that family is more than 50 years old..!
Bollywood Hero: Did you foresee death..No one in that family is more than 50 years old..!

70వ దశకంలో ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో..

1970 , 80 కాలం మధ్యలో ఇండస్ట్రీని ఏలేసిన ఈ స్టార్ హీరో మౌసం , నయా దిన్ నై రాత్ , నౌకర్, అంగూర్, షోలే, పతి – పత్ని ఔర్ ఓ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకొని తనదైన నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా వంటి సూపర్ స్టార్లు ఆధిపత్యం చెలాయించిన కాలంలో ఈయన తన వయసును ధిక్కరించే పాత్రలు కూడా పోషించి ప్రత్యేకంగా నిలిచారు.. అయితే అతి చిన్న వయసులోనే మరణించిన ఈయన ఇప్పటికీ ఈయన పోషించిన పాత్రలను సినీ ప్రియులు మర్చిపోలేరనటం అతిశయోక్తి కాదు.. తన అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు..

మరణాన్ని ముందే ఊహించారా..

అలా వయసుకు మించి పెద్ద పాత్రలు పోషించిన ఈయనను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. దానికి విస్తుపోయే సమాధానం చెప్పారు.. హీరో సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎందుకంటే నా వృద్ధాప్యాన్ని నేను ఎప్పటికీ చూడలేను.. అందుకే వృద్ధాప్య వయసును తెరపై ప్లే చేస్తూ అనుభవిస్తున్నాను అని అన్నారు ..నిజానికి సంజీవ్ కుమార్ ఇంట్లో ఏ వ్యక్తి కూడా 50 ఏళ్లు దాటి జీవించలేదు ..అందుకే సంజీవ్ కుమార్ కూడా 47 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు.. ఇక తన మరణాన్ని ముందే ఊహించారేమో.. అందుకే వృద్ధాప్యాన్ని అనుభవించలేని అని.. ఆ అనుభవాన్ని తెరపై చూసుకుంటున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

కుటుంబంలో ఎవరూ కూడా 50 ఏళ్లకు మించి జీవించలేదు..

ఇకపోతే సంజీవ్ కుమార్ కు గుండెపోటు రాగా శస్త్ర చికిత్స జరిగింది.. ఆ తర్వాత కొద్ది రోజులకే అంటే 1985 నవంబర్ 6న ఆయన మరణించారు.. మరణానికి ముందు తాను వృద్ధాప్యాన్ని చూడలేను అని చెప్పిన సంజీవ్ కుమార్ . చెప్పిన మాటలే నిజమయ్యాయి.. ఇక ఈయన తాత, తండ్రి , తమ్ముడు ఇలా కుటుంబంలోని పురుషులు అందరూ కూడా 50 ఏళ్ళు నిండకముందే మరణించారు.. మరి ఇది వీరి కుటుంబానికి శాపమా లేక మరేదైనా కారణమా అన్నది తెలియదు కానీ.. ఎవరూ కూడా పూర్తి జీవితాన్ని అనుభవించలేదు అని చెప్పవచ్చు.. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు