WAR2 : వార్2 పై క్రేజీ న్యూస్.. ఆ సీన్ లోనే అసలు ట్విస్ట్?

WAR2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న క్రేజీ చిత్రాల్లో “వార్2” కూడా ఒకటి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో శరవేగంగా చిత్రీకరించే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమా పూర్తి చేస్తూనే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కాంబోలో తెరకెక్కుతున్న మల్టి స్టారర్ అని తెలిసిందే. ప్రస్తుతం ఇండియా లో తెరకెక్కుతున్న అతిపెద్ద మల్టి స్టారర్ ఇదే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రెగ్యులర్ గా జరుపుకుంటుందని, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా వార్2 ని కూడా ఫినిష్ చేస్తామని మేకర్స్ అంటున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 400 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగా వార్2 (WAR2) గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

WAR2 Movie Latest Schedule Update

వార్2 లో మేజర్ ట్విస్ట్..

ఇక ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న వార్2 నెక్స్ట్ షెడ్యూల్ జులై చివరి వారంలో మొదలవుతుందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వార్2 సినిమా క్లైమాక్స్ లో ఒక ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని.. ఆ ట్విస్ట్ క్లైమాక్స్ లో ఉంటుందని సినిమాకి అదే మేజర్ ప్లస్ గా నిలుస్తుందని అంటున్నారు. అంతే కాదు ఆ ట్విస్ట్ ని అలాగే కొనసాగిస్తూ ‘వార్3’ కంటిన్యూ చేస్తారని సమాచారం. ఇక ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ లో హృతిక్ అలాగే ఎన్టీఆర్ లతో పాటు సినిమాలో ఇతర ప్రధాన తారాగణం కూడా షూట్ లో పాల్గొంటారని టాక్. ఇక ఈ షెడ్యూల్ జులై నాలుగో వారంలో మొదలుపెడతారని, ఈ షెడ్యూల్ తో సినిమా ఎనభై శాతం పూర్తయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ నిజమే అయితే ఎన్టీఆర్ మరో బాలీవుడ్ మూవీ కూడా ఖాయమే అని చెప్పొచ్చు.

- Advertisement -

వెయ్యి కోట్ల బొమ్మగా వార్2…

ఇక వార్2 సినిమా కోసం పాన్ ఇండియా వైడ్ గా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మెడిలో ట్రెండ్ చేయడనికి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఢీ అంటే ఢీ అనేలా ఉంటుందని టాక్. వార్ ఫస్ట్ పార్ట్ లో కాస్త హృతిక్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టగా, ఈ పార్ట్ లో మాత్రం ఇద్దరిపైనా సమానంగా అన్ని సీన్లు, ఎలివేషన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. అన్ని కుదిరితే ఈ సినిమా వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు