Sreemukhi : పెళ్లి గురించి శ్రీముఖి షాకింగ్ రియాక్షన్.. అంటే అది?

Sreemukhi : టాలీవుడ్ లో ఉన్న పాపులర్ యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. తన టాలెంట్ తో కంటే గ్లామర్ షో ద్వారానే ఎక్కువ ఫేమస్ అయిన ఈ బ్యూటీ అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. అయితే బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ, జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువకాగా, సినిమాల్లో హీరోయిన్ గా పెద్దగా ఆఫర్లు రాకపోయేసరికి బుల్లితెరపైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు ప్రముఖ ఛానల్ లలో ఎంటర్టైన్మెంట్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో శ్రీముఖి ఎంత యాక్టీవ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడూ తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. ఇక లేటెస్ట్ నిన్న సండే రోజు శ్రీముఖి (Sreemukhi) నెట్టింట తన ఫాలోవర్లతో చేసిన చిట్ చాట్ వైరల్ అవుతుంది. ఈ చాట్ లో పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

Anchor Srimukhi's shocking reaction about marriage

పెళ్ళెప్పుడు శ్రీముఖి.. అంటే అది?…

బుల్లితెరపై పలు ఎంటర్టైన్మెంట్ షోలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్లతో చిట్ చాట్ చేయగా, ఆ చాట్ లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలకు రియాక్షన్ ఇచ్చింది. దీంట్లో భాగంగా ఓ ఫాలోవర్ తనని శ్రీముఖి ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అని అడగగా.. దానికి షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టుగా మీమ్ ని షేర్ చేసింది. అందులో ఓ సీన్ లో .. అంటే..అది.. అరె రామ్ అంటూ.. సాగే బ్రహ్మానందం ఇమోజి ని పెట్టేసింది. అంటే అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పేసింది. అప్పట్లో ఓ ఇంటర్వ్యూ లో రెండు మూడేళ్లలో పెళ్లి చేసుకుని ఈ ఇండస్ట్రీకి దూరంగా ఉంటానని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనే లేకుండా వరుస షో లతో బిజీగా ఉంది.

- Advertisement -

నీ ఏజ్ ఎంత?

ఇక శ్రీముఖి చేసిన చిట్ చాట్ లో ఓ నెటిజన్ నిన్ను బాగా ఇరిటేట్ చేస్తూ, అలాగే కేరింగ్ చేసే వ్యక్తి ఎవరు అని అడగగా, దానికి శ్రీముఖి ఆర్జే చైతూ, అవినాష్ అని ఫొటోలతో చెప్పింది. అలాగే ఈ షాట్ లో ఎంటర్టైన్మెంట్ షోలను మాత్రం అస్సలు వదలొద్దు అంటూ ఫ్యాన్స్ రిక్వెస్టులు కూడా పెడుతున్నారు. శ్రీముఖి కూడా ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నంత వరకు బుల్లితెరను వదలను అని శ్రీముఖి చెప్పుకొచ్చింది. ఇక ఫైనల్ గా ఈ చిట్ చాట్ లో ఓ నెటిజన్ శ్రీముఖిని తన ఏజ్ ఎంత అని అడగ్గా తన వయసు 31 అని ఓ నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది. ఇక ఇలా ఫాన్స్ తో చాట్ చేయడమే కాకుండా ఘాటు ఫోజులతో పోటోషూట్లతో రచ్చ చేస్తూ ఉంటుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు