Hero Nani:  లిప్ లాక్ సీన్.. హీరోయిన్ కండీషన్.. హీరో షాక్..!

Hero Nani.. నాచురల్ స్టార్ హీరో నాని సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా చలామణి అవ్వడమే కాదు నిర్మాతగా కూడా దూసుకుపోతున్నారు.. కొత్త వ్యక్తులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. సత్తా చాటుతున్నారు.. అంతేకాదు భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మిస్తూ నటిస్తూ మరింత పేరు సొంతం చేసుకున్నారు నాని.. ఇకపోతే దర్శకుడు ఎలా చెబితే అలా తనను మార్చుకుని .. రొమాంటిక్ మూవీ చేసినా..  ఫ్యామిలీ డ్రామా చేసినా. మాస్ మూవీ చేసినా. ఆయన పర్ఫామెన్స్ చాలా నాచురల్ గానే అనిపిస్తుంది. అందుకే నాచురల్ స్టార్ అయిపోయారు నాని.
Hero Nani: Lip Lock Scene.. Heroine Condition.. Hero Shock..!
Hero Nani: Lip Lock Scene.. Heroine Condition.. Hero Shock..!

నాని లిప్ లాక్ సన్నివేశాలు..

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్ లో గురించి ఎప్పుడు చర్చ జరిగినా సరే సోషల్ మీడియాలో పెద్ద హంగామానే  జరుగుతుంది.. ముఖ్యంగా హీరో,  హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నాని విషయంలో కూడా ఇదే జరిగింది.. చూడడానికి పక్కింటి అబ్బాయి లాగా అనిపించే నాని రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఆ రచ్చ ఇంకా ఎక్కువవుతుంది.. నాని గతంలో కొన్ని చిత్రాలలో లిప్ లాక్ సన్నివేశాలలో నటించారు..

కండిషన్ పెట్టిన కృతి శెట్టి..

ప్రత్యేకించి శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి చెప్పుకోవాలి.. ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి రెండవ సినిమాలోనే లిప్ లాక్ సన్నివేశాలలో నటించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. ఇక ఇక్కడే ఈమె కండీషన్ కూడా పెట్టిందట.. అసలు విషయంలోకి వెళ్తే.. నాని , కృతి శెట్టి మధ్య రొమాంటిక్ కిస్సింగ్ సీన్ ఉంది.. ఈ సన్నివేశంలో నటించే ముందు డైరెక్టర్ ను  నాని చాలా ప్రశ్నలు అడిగారట .  ఎందుకంటే ఏదో కావాలని లిప్ లాక్  సీన్ ఉండకూడదని .. కథలో భాగంగా ఉండాలి అని చెప్పారట డైరెక్టర్.. ఇక ఆ సీన్ చేసేటప్పుడు నానికి మరో జన్మ గుర్తుకు వస్తుంది కాబట్టి అది కూడా కథలో భాగమే .. అయితే ఈ సన్నివేశం చేసేటప్పుడు హీరోయిన్ కృతి శెట్టి ఒక షాకింగ్ కండిషన్ పెట్టిందట లిప్ లాక్ జరిగేటప్పుడు డైరెక్టర్,  కెమెరామెన్ తప్ప తన చుట్టూ ఇంకెవరు ఉండకూడదని.. ఆమె కండిషన్ పెట్టిందట. ఇక ఆమె ప్రైవసీని అర్థం చేసుకున్న డైరెక్టర్ అలాగే చేసినట్లు సమాచారం.. ఇదిలా ఉండగా మరోవైపు హాయ్ నాన్న సినిమాలో కూడా నాని మృణాల్ మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి .

షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన నాని..

ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ నాని లిప్ లాక్ సన్నివేశాలను ఉద్దేశించి.. మీరే కావాలని డైరెక్టర్ ను  అడిగి ఇలాంటి సీన్స్ రాయించుకుంటున్నారా అని ప్రశ్నించగా.. దీనికి నాని అదిరిపోయి రియాక్షన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. దసరా , అంటే సుందరానికి వంటి సినిమాలలో ఈ లిప్ లాక్ సన్నివేశాలు లేవు కదా..మరి ఎందుకు అలా అడుగుతున్నారో అర్థం కావడం లేదు.. సినిమాకి హైప్ రావడం కోసం.. టీజర్ లో పెడితే పబ్లిసిటీ వస్తుందని రొమాంటిక్ సీన్స్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించారు.. కథ డిమాండ్ చేస్తున్నప్పుడు దర్శకుడి మాటలు గౌరవించి ఇలాంటి సన్నివేశాలు చేస్తాను.. అంతే తప్ప ఇలాంటి సన్నివేశాలు చేయడం నాకేమీ సరదా కాదు అంటూ గట్టి జలక్ ఇచ్చారు నాని.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు