Anushka dupe : అనుష్క కే కాదు డూప్ కు కూడా కష్టాలే… అకారణంగా దేవర నుంచి తీసేశారు..!

Anushka dupe.. సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే హీరో హీరోయిన్లు చేయలేని కష్టమైన సన్నివేశాలను.. వారి డూప్ లతో చేయిస్తూ ఉంటారు దర్శకులు. కానీ ఒక్కొక్కసారి కొన్ని కారణాలవల్ల హీరోయిన్లు కూడా అవకాశాలు కోల్పోతూ ఉంటారు.. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి హీరోయిన్ ల విషయంలోనే కాదు డూప్ ల విషయంలో కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు.. ఈ క్రమంలోనే తాజాగా హైట్ విషయంలో బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది అనుష్క శెట్టి డూప్ రుషిక..

Anushka dupe: Not only Anushka, dupe also has problems... Intuitively removed from Devara
Anushka dupe: Not only Anushka, dupe also has problems… Intuitively removed from Devara

హైట్ విషయంలో జాగ్రత్తలు..

అసలు విషయంలోకి వెళితే.. టాలీవుడ్ లో ప్రధానంగా వినిపించే స్టార్ హీరోలు ఆరుగురు.. అందులో పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ రామ్ చరణ్.. వీళ్లలో ప్రభాస్ ,మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన వాళ్లంతా కొంచెం హైట్ తక్కువే.. ఇక రాంచరణ్, అల్లు అర్జున్ పక్కన కొంతవరకు హీరోయిన్లను అడ్జస్ట్ చేయవచ్చు.. కానీ ఎన్టీఆర్ వీరి కంటే కూడా హైట్ తక్కువగా ఉంటారు.. ఎంతో టాలెంట్, స్టార్డం కలిగి ఉన్న ఎన్టీఆర్ కి ఇదే పెద్ద మైనస్ అని చెప్పడంలో సందేహం లేదు. దిగ్గజ నటులు సీనియర్ నటులు అయిన కోట శ్రీనివాసరావు కూడా ఎన్టీఆర్ విషయాలపై డైరెక్ట్గా స్పందించారు కూడా. అందుకే హీరోయిన్లని ఎన్టీఆర్ పక్కన అడ్జస్ట్ చేయడం అనేది సినిమా క్రూ మెంబర్స్ కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది.

హైట్ కారణంగా ఛాన్స్ మిస్ చేసుకున్న అనుష్క డూప్..

ఇకపోతే హీరోయిన్ల విషయంలోనే కష్టంగా ఉంది అంటే కానీ వీరి పక్కన క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఏరి కోరి ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలి అంటే అందం, అభినయంతో పాటు టాలెంట్ ప్రధానం .. కానీ ఇక్కడ హైట్ కూడా ప్రధానంగా మారిందని చెప్పాలి. అందుకే తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా హీరోయిన్స్ విషయంలో అంతే స్ట్రిక్ట్ గా సెలక్షన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.. తాజాగా కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనులకు ఇంకా సమయం తీసుకుంటున్నారు.. కొన్ని ముఖ్య పాత్రల కోసం చాలామందిని ఆడిషన్ చేశారు.. ఆ టైంలో కన్నడ నటి రుషిక రాజ్ ను కూడా ఒక కీలక పాత్ర కోసం కచ్చితంగా తీసుకుంటున్నట్టు తెలిపి మరి లుక్ టెస్ట్ చేశారు.. ఆమె పాత్ర ప్రకారం ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించాల్సి ఉంది.. కానీ ఆమె హైట్ 5 అడుగుల 11 అంగుళాలు.. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈమె కీలక సన్నివేశాలలో నటించాల్సి ఉంది. మరోపక్క ఎన్టీఆర్ హైట్ 5.7 అడుగులు.. ఇక ఇద్దరి మధ్య హైట్ కంపారిజన్ చేసుకుంటే రుషిక రాజ్ మరీ హైట్ గా ఉందని భావించి.. ఆమెను ఈ సినిమా నుంచి తీసేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది..

- Advertisement -

బాహుబలిలో చేసిన అనుష్క డూప్ గా చేసిన రుషిక రాజ్

ఇకపోతే బాహుబలి సినిమాలో అనుష్కకి డూప్ గా చేసింది రుషిక రాజ్ .. ఆ తర్వాత అశ్మీ అనే సినిమాలో కూడా ఈమె నటించింది.. ఇప్పుడు కన్నడ సినిమాలలో నటిస్తోంది.. అయితే తన హైట్ కారణంగా ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ హైట్ విషయంలోనే అనుష్క కూడా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను వదులుకుంది. ఇప్పుడు ఆమెకే కాదు ఆమెకు డూప్ గా చేసిన రుషిక రాజ్ కి కూడా కేవలం ఈ విషయంలోనే అవకాశాలు చేజారి పోతూ ఉండడం నిజంగా బాధాకరమని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు