Allu Arjun VS Ram Charan : బన్నీ నోటి దూల… గేమ్ ఛేంజర్‌ని అలా అనేశాడేంటి..?

Allu Arjun VS Ram Charan : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాల కన్నా ఎక్కువగా ఈ మధ్య వివాదాలతో ఫెమస్ అవుతున్నాడు.. మొన్న ఏపీలో జరిగిన ఎన్నికలలో బన్నీ ప్రచారం చెయ్యడమే అతనికి శాపంగా మారిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.. అదే కారణంతో మెగా ఫ్యామిలీకి ఆల్మోస్ట్ దూరం అయ్యాడు.. అయినా బన్నీ తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.. ఇలాంటి క్రమంలో ఇప్పుడు నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. బన్నీ గేమ్ చేంజర్ సినిమాపై కామెంట్స్ చేసినట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.. ఈ సినిమాలో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది.. ఇక త్వరగా మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ క్రమంలో బన్నీ సినిమా గురించి తప్పుడు ప్రచారం చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.. అయితే నిజానికి బన్నీ ఎటువంటి ప్రచారం చెయ్యలేదని తెలుస్తుంది.. బన్నీ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని టాక్..

Bunny Ram Charan fans war .. negative publicity on game changer movie
Bunny Ram Charan fans war .. negative publicity on game changer movie

అంతేకాదు గతంలో వీరిద్దరి ఫ్యాన్స్ కు మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి.. ఇప్పుడు ఈ వార్తలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి.. ఇవి ఎంత దూరం వెళ్తాయో చూడాలి.. ఏది ఏమైనా వీరిద్దరి ఫ్యామిలీల మధ్య అంతగా మాటలేవని తెలిసిందే.. మళ్లీ కలుస్తారా లేదా అన్నది చూడాలి.. సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు.. బన్నీ పుష్ప 2 సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు లైనప్ లో ఉన్నట్లు తెలుస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు