Maharaja OTT : ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి సెంటిమెంటల్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Maharaja OTT :  ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ’మహారాజ’.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ ను అందుకుంది.. తండ్రీ, కూతుర్ల మధ్య సాగే సెంటిమెంట్ తో ఈ సినిమా కథ వచ్చింది.. కథ సినిమాకు పాజిటివ్ టాక్ ను అందించింది.. ఇప్పటికి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. థియేటర్లలో మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చెయ్యబోతుంది.. ఈ సినిమా ఓటీటీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. ఈ సినిమాను ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

విజయ్ నటించిన 50వ సినిమాగా ఈ సినిమా వచ్చింది. మొదటి షోతో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా వీకెండ్‌లో భారీగా ఆక్యుపెన్సీ పెరిగింది. తన తొలి సినిమా అయినప్పటికీ నితిలన్ స్వామినాథన్ మంచి టాక్ ను అందుకున్నాడు.. ఇక ఈ సినిమా బుకింగ్స్ ఊచకొత మొదలుపెట్టింది.. ఇప్పుడు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా జులై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది…

Vijay Sethupathi's sentimental movie that has come to OTT.. Where can I watch it?
Vijay Sethupathi’s sentimental movie that has come to OTT.. Where can I watch it?

ఈ మూవీ కథ విషయానికొస్తే.. ఈ మూవీలో హీరో ఒక బార్బర్ గా నటించారు.. కూతురు కోసం ఆరాట పడే తండ్రిగా చక్కగా నటించారు.. ఇక ఈ సినిమాలో విజయ్ పెర్ఫార్మన్స్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి.. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి, భారతీరాజా, అభిరామ్, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ ఫేమ్ మణికందన్, కల్కి, సచన నిమిదాస్ కీలక పాత్రలు పోషించారు.. సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి ఈ సినిమాను నిర్మించగా, అజనీష్ లోక్‌నాథ్ చక్కటి సంగీతం అందించారు.. థియేటర్లలో మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు