Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకప్పటి అందాల సుందరి..!

Tollywood: అలనాటి సీనియర్ నటి రేవతి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రేవతి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. రేవతి 9వ దశకంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. డైరెక్టర్ రేలంగి నరసింహారావు తెరకెక్కించినటువంటి మానసవీణ సినిమా ద్వారా రేవతి తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రేవతి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది.

ఆ సినిమా అనంతరం వరసగా సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించింది. అలా…. ప్రేమ, గాయం, రాత్రి వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి గాయం సినిమాలో నటించి అలరించింది. ఆ సినిమా తర్వాత వెంకటేష్ సరసన ప్రేమ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా అప్పట్లో యువతను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ బ్యూటీ సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Revathi's Heartfelt Letter On Ram Mandir Goes Viral - Oneindia News

- Advertisement -

ఇక రేవతి సినిమాల పరంగా తన కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే 1986లో సురేష్ చంద్ర మీనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక వీరు 2013 సంవత్సరంలో ఏవో కొన్ని అనివార్య కారణాలతో విడిపోయారు. విడాకులు అనంతరం రేవతి సినిమాలకు కాస్త దూరంగా ఉంది. ఇక ఈ మధ్యకాలంలోనే రేవతి తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.

సైజ్ జీరో, లోఫర్, మేజర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది రేవతి. ఇదిలా ఉండగా…. జూలై 8వ తేదీన అంటే ఈరోజున రేవతి పుట్టినరోజు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ నటీనటులు, అభిమానులు రేవతికి బర్త్డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే రేవతి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అందులో ఒక్కటి మీరు కూడా చూసేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు