Samantha: ఆ విషయంలో నన్ను మోసం చేశారు..సమంత సంచలనం !

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి కోట్లాదిసంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. తన నటన, పర్ఫామెన్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక ఈ బ్యూటీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తాను నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుసగా సినిమాల్లో నటిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. దాదాపు 14 ఏళ్ల నుంచి ఈ బ్యూటీ ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది.

ఇక సమంత టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరు దాదాపు నాలుగేళ్ల పాటు కలిసి వారి దాంపత్య జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకులు అనంతరం ఎవరికివారు వారి పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక సమంత విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఇక ఆ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటుంది.

వ్యాధి నుంచి కోలుకున్న సమంత ప్రస్తుతం డైట్, వ్యాయామాలు, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మళ్లీ సినిమాల్లో రాణిస్తోంది. ఇదిలా ఉండగా ….సమంతకి సంబంధించిన ఓ వార్తా ప్రస్తుతం వైరల్ గా మారింది. సమంత కొద్దిరోజుల క్రితం ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకుంటూ కొన్ని వాక్యాలు చేసింది. అందులో భాగంగానే ప్రేమ గురించి చెబుతూ…. తన జీవితం కూడా దివంగత నటి సావిత్రిలా అయ్యుండేదని…. తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నానని సంచలన వాక్యాలు చేసింది.

- Advertisement -

Samantha: Because of that hero.. Samantha's marital relationship is ruined..?

మొదట్లో సావిత్రి జీవితం గురించి తనకు పెద్దగా తెలియదని…. మహానటి సినిమా చేస్తున్న సమయంలో సావిత్రి గారి గురించి తెలుసుకున్నానని…. ఆ సినిమా సమయం నుంచి సావిత్రి గారి మీద ఎంతో గౌరవం, మర్యాద పెరిగిందని చెప్పుకొచ్చింది. అచ్చం సావిత్రి గారికి జరిగినట్లే నా జీవితంలో కూడా అలాంటి సంఘటన జరిగి ఉండేది. అదృష్టవశాత్తు నేను బయటపడ్డాను లేదంటే నా పరిస్థితి సావిత్రి గారిలాగే అయ్యుండేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వాక్యాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు