VidaaMuyarchi : థలా సినిమాపై రచ్చ.. ఆ సినిమా కూడా కాపీయేనా?

VidaaMuyarchi : కోలీవుడ్ స్టార్ థలా అజిత్ ఒకేసారి రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి “విదా ముయార్చి” కాగా, మరొకటి “గుడ్ బ్యాడ్ అగ్లీ”. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమాని తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే విదా ముయార్చి సినిమాను మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో రెజీనా కసాండ్రా, అర్జున్ సర్జా, ఆరవ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి తాజాగా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతుంది.

Is VidaaMuyarchi movie a copy of Hollywood movie?

విదా ముయార్చి ఆ సినిమాకు కాపీయా?

కోలీవుడ్ స్టార్ థలా అజిత్ నటిస్తున్న విదా ముయార్చి సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి కాపీగా తెరకెక్కుతోందన్న వార్త నెట్టింట వైరల్ అవుతుంది. హాలీవుడ్ లో బ్రేక్ డౌన్ అనే యాక్షన్ మూవీ 2016 లో విడుదలై మంచి విజయం సాధించగా, ఆ సినిమాకి రీమేక్ గా విదా ముయార్చి సినిమా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు కూడా ఆ సినిమానే పోలి ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. మరి ఈ వార్తలపై ఎంత నిజముందో మేకర్స్ నుండే క్లారిటీ రావాలి. ఇక ఇంతకు ముందు కూడా అజిత్ ఎన్నో రీమేక్ చిత్రాల్లో నటించాడని తెలిసిందే.

- Advertisement -

గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా?

ఇక అజిత్ నటించిన నెర్కొండ పర్వాయి (పింక్) రీమేక్ తర్వాత మళ్ళీ రీమేక్ సినిమా చేయలేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత అజిత్ రీమేక్ సినిమాలు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మొన్నమధ్య గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా కొరియన్ మూవీ “ది గ్యాంగ్ స్టర్ ది కాప్ ది డెవిల్” కి రీమేక్ గా తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. 2019లో వచ్చిన ఆ సినిమా కొరియన్ భాషలో మంచి సక్సెస్ అయింది. దీనిపై కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు విదా ముయార్చి పై కూడా కాపీ ట్రోల్ నడుస్తుంది. మరి దీనిపై ఆయా చిత్ర నిర్మాతలే క్లారిటీ ఇస్తే గాని తెలీదు. ఇక విదా ముయార్చి సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోగా దీపావళి కానుకగా ఆ సినిమాని రిలీజ్ చేద్దామని మేకర్స్ ట్రై చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు