Kalki 2898AD Collections : అశ్విని దత్ కూడా అస్సలు ఊహించి ఉండడు.. ఇలా అయితే కష్టమే..

Kalki 2898AD Collections : ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పోగేసుకున్న సినిమాగా కల్కి దూసుకుపోతుంది.. ఒకవైపు పాజిటివ్ టాక్ తో పాటుగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది.. ఇప్పటి వరకు ఈ సినిమా 900 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందంటే అది మామూలు విషయం కాదు.. ఇప్పటికి టికెట్ల రేట్లను తగ్గించిన కూడా కలెక్షన్స్ లో మాత్రం తేడా రాలేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభాస్ సినిమా అంటే ఇంతే అని మరోసారి నిరూపించాడు..

ఇకపోతే ఈ సినిమా విడుదలై ఈరోజుకు 11 రోజలు పూర్తి అయ్యింది.. మొదటి వీకెండ్ లో సినిమా సూపర్ హిట్ టాక్ తో పాటుగా కాసుల వర్షం కురిపించింది.. ఈ 11 రోజులకు గాను ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు కలిపి భారీగానే కలెక్ట్ చేసిందని కల్కి టీమ్ అనౌన్స్ చేసేసింది.. మొదటి రోజు 191 కోట్ల గ్రాస్ వసూలు చేయగా ఇప్పుడు 11 రోజులకు 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.. ఈ సినిమాకు ముందు, వెనుక ఎటువంటి సినిమాలు విడుదల కాకపోవడంతో సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి..

kalki movie boxoffice collections
kalki movie boxoffice collections

ఇక హిందీలో కూడా ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇలా అన్ని చోట్ల ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అయి సినిమా ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ. 945 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తుంది.. ఇదే జోష్ లో కలెక్షన్ ను అందుకుంటే మాత్రం సినిమా 1000 కోట్లను దాటి 2000 కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నట్లు సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతున్న విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు