Anjali: హీరోయిన్ అంజలీ లో ఎందుకు ఇంత మార్పు..?

Anjali: ప్రముఖ తెలుగు హీరోయిన్ అంజలి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే.. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా పెద్దగా ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు.. దాంతో కోలీవుడ్ కు వెళ్లిపోయిన ఈమె అక్కడే అవకాశాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది.. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ మొదలుకొని జూనియర్ హీరోయిన్ల వరకు అందరూ గ్లామర్ పాత్రల వైపే ఆసక్తి చూపిస్తున్నారు.. ఎందుకంటే ఆ పాత్రలు క్లిక్ అయితే చాలు వరుస సినిమాలతో దూసుకెళ్ళవచ్చు.. సినీ ఫీల్డ్ లో అవకాశాలు లేనప్పుడు బోల్డ్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రల కోసం ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.

Anjali: Why so much change in heroine Anjali..?
Anjali: Why so much change in heroine Anjali..?

గుర్తింపు పొందాలంటే మార్పు రావాల్సిందే..

ఇకపోతే ఈ బ్యూటీ కథ కూడా అలాంటిదే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీత నుంచి బహిష్కరణ వేశ్య పాత్ర వరకు వెళ్లిన అంజలి.. ఇంతలోనే ఇంత మార్పు రావడానికి గల కారణం ఏమిటి అంటే అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సీతగా అంజలి అంత మంచి పేరు తెచ్చుకొని.. ఇప్పుడు సడన్గా ఇంత మార్పు ఎలా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ ముద్దుగుమ్మ రూట్ మార్చిందని చెప్పవచ్చు.. ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్స్ వైపే అడుగులు వేస్తోంది. తాజాగా విడుదలైన బహిష్కరణ సిరీస్లో వేశ్యగా కనిపించింది అంజలి.. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా కవర్ చేస్తూ దూసుకుపోతోంది. సినిమాల వరకు చాలా పద్ధతిగా ఉంటున్న ఈమె.. వెబ్ సిరీస్ లలో మాత్రం నట విశ్వరూపం చూపిస్తూ అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతోంది..

సీత క్యారెక్టర్ నుంచి వేశ్యగా..

పావకదైగాల్ అనే వెబ్ సిరీస్లో ఈమె లెస్బియన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఝాన్సీలో రొమాంటిక్ సన్నివేశంలో కూడా నటించింది.. ఇలా మొత్తానికైతే అన్ని పాత్రలు చేస్తూ అందరిని అలరిస్తోంది. ఒక్క పాత్రకే పరిమితమైపోతే సినిమాలలో అవకాశాలు రావడం మరింత కష్టం.. అందుకే పాత్రకు తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ అన్ని పాత్రలు చేస్తూ అన్నింటిలో కూడా సత్తా చాటుతోంది అంజలి.. ఏది ఏమైనా తెలుగమ్మాయి అని తెలుగు సినీ ఇండస్ట్రీ ఆదరించకపోయినా.. ఇతర భాషా ఇండస్ట్రీలలో సత్తా చాటుతూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది..

- Advertisement -

అంజలి సినిమాలు…

ఇక ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో రాంచరణ్ సరసన నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తూ ఉండగా.. అందులో ఒక క్యారెక్టర్ కి జోడిగా నటిస్తూ ఉండడం గమనార్హం.. మొత్తానికైతే ఈ సినిమా గనుక మంచి విజయం సాధించిందంటే ఈ సినిమాతో అంజలి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోతుందనటంలో సందేహం లేదు.. ఏదేమైనా సీతగా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఇప్పుడు వేశ్యగా కూడా నటిస్తూ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ అలరిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు