Mahesh Babu: అప్పుడు తాతయ్యగా కనిపించిన నాజర్ ఇప్పుడు టీచరు కాబోతున్నాడు

Mahesh Babu: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో నాజర్ ఒకరు. కేవలం ఒక రకమైన పాత్రలనే కాకుండా అన్ని రకమైన పాత్రలలో నూ అద్భుతంగా ఇమిడిపోయి నటుడు నాజర్. నాజర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా నాజర్ కి మంచి గుర్తింపును సినిమా అంటే మాతృదేవోభవ అని చెప్పొచ్చు. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తాయి.అలానే అద్భుతమైన సందేశాన్ని కూడా ఈ సినిమాతో ఇచ్చారు అని చెప్పొచ్చు.

నాజర్ కి మంచి పేరు తెచ్చిన సినిమాలంటే మాతృదేవోభవ, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బొంబాయి, శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలని చెప్పొచ్చు. అతడు సినిమాలో క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబుకి తాతయ్యగా కనిపిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు నాజర్.కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ్ సినిమాల్లో కూడా నాజర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఇంకా తెలుగులో నాజర్ కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలంటే అతడు, బిజినెస్ మేన్, బాద్షా, బాహుబలి, పోకిరి, సింహాద్రి, చంటి ఈ సినిమాలన్నిటిని కూడా చెప్పొచ్చు.

SS Rajamouli to collaborate with Mahesh Babu

- Advertisement -

పోకిరి సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా నటించి క్లైమాక్స్ లో నాజర్ ఇచ్చిన ఎలివేషన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఏ పాత్రనైనా వేరే స్థాయికి తీసుకెళ్లడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య.
ఇకపోతే బిజినెస్ మేన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన తీరు వేరే లెవెల్ అని మనకి తెలిసిందే. మహేష్ బాబుకి ఆయనకి ఉన్న కాన్వర్జేషన్ అద్భుతంగా ఉంటుంది ఆ సినిమాలో. ఇకపోతే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాలు నాజర్ కూడా భాగం కానున్నాడు. ఆ సినిమాకు సంబంధించి మహేష్ బాబు కి యాస విషయంలో నాజర్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఆన్ స్క్రీన్ పై కలిసిన నటించిన నాజర్ ఆఫ్ స్క్రీన్ లో మహేష్ కి ట్రైనింగ్ ఇవ్వడం వలన ఈ సినిమా మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు