Spirit: ప్రభాస్ సినిమా గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవం సందీప్ ఇంకా ఎవరిని కలవలేదు

Spirit: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. మొదటి సినిమాతోనే తన స్టామినా ఏంటో చూపించి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన భారీ విజయాన్ని పొందుకున్నాడు. అయితే అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ అనే పేరుతో తెరకెక్కించి అక్కడ కూడా మంచి హిట్ అందుకున్నాడు. చాలామంది కబీర్ సింగ్ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు. అయితే ఆడియన్స్ మాత్రం దాదాపు 250 కోట్లకు పైగా కలెక్షన్స్ అందించారు.

కబీర్ సింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు సందీప్ రెడ్డి వంగను టార్గెట్ చేశారు. కబీర్ సింగ్ సినిమాను ఒక వైలెంట్ ఫిలిం అంటూ చెప్పుకొచ్చారు. అయితే వీటిపై సందీప్ రెడ్డి వంగ స్పందిస్తూ అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ అనిమల్ సినిమాని తెరకెక్కించాడు. అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ గా నిలిచి దాదాపు 1000 కోట్ల పైగా వసూలు చేసింది. ఇకపోతే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి స్పిరిట్ అనే టైటిల్ ని ఖరారు చేశారు.

ఇక రీసెంట్ గా ప్రభాస్ కల్కి సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 900 కోట్లు వసూలు చేసింది. ఇంకో రెండు మూడు రోజుల్లో దాదాపు 1000 కోట్లు వసూలుకి చేరిపోతుందని చెప్పొచ్చు. ఇకపోతే ప్రభాస్ దీని తర్వాత చేయబోయే స్పిరిట్ సినిమా గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా నటులను ఎంపిక చేసి ఈ సినిమాలో పెడతాడు అని తెలుస్తోంది.

- Advertisement -

Spirit Movie

అయితే దీనికి సంబంధించి సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు కాస్టింగ్ ఇంకా ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వరకు 80% పూర్తయిపోయింది. కంప్లీట్ గా ఈ సినిమా స్క్రిప్ట్ వరకు పూర్తి అయిపోయిన తర్వాత మిగతా ఆర్టిస్టులకు కథను చెప్పి వాళ్ళని ఈ ప్రాజెక్టులోకి తీసుకొని ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలో కొందరు కనిపిస్తారు అని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలుస్తుంది. కల్కి సినిమాను పూర్తి చేసుకున్న ప్రభాస్ తర్వాత మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో బిజీ కానున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగ రిలీజ్ కాబోతున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు