Sudheer Babu: దయచేసి క్షమించండి అలాంటి వాడు అని తెలియక అవకాశం ఇచ్చాను

Sudheer Babu: ట్విట్టర్ వేదిక గత నాలుగు రోజుల నుండి ఒక యూట్యూబర్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే సదరు యూట్యూబర్ చాలా రోజుల క్రితం నుండి సినిమాలను రోస్టింగ్ చేస్తూ, షార్ట్ ఫిలిమ్స్ ను రోస్టింగ్ చేస్తూ, చాలా అసభ్యంగా కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన ఈ ప్రణీత్ హనుమంత్ అనే పర్సన్ కు అనేక సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అలానే కొన్ని సినిమా ప్రమోషన్స్ కి ఈయనను వాడుకుంటూ ఉండేవాళ్ళు.

ఇకపోతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఒక డాటర్ అండ్ ఫాదర్ వీడియోని వీళ్ళు ట్రోల్ చేస్తూ అసభ్యంగా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఎప్పుడు చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అయితే కొంతమంది దీనిని ఖండించినా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా రాజకీయ నాయకులను చట్టాలను అడగటం మొదలుపెట్టాడు అక్కడితో అందరూ కూడా ఈ ప్రణీత హనుమంతు ఇంకా టీం పై కఠిన చర్యలు తీసుకుంటామని రియాక్ట్ అయ్యారు.

ఇకపోతే రీసెంట్ గా ప్రణీత్ హనుమంతు సుదీర్ బాబు నటించిన హరోం హరా అనే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. అయితే ఈ విషయంపై ఇప్పుడు సుధీర్ బాబు స్పందిస్తూ. ఇది మంచో చెడో నాకు తెలియదు కానీ నేను సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండను. ప్రణీత్ హనుమంతు లాంటివాడిని మా సినిమాలో పెట్టుకున్నందుకు మా తరఫున మా టీం తరఫున అందరికీ క్షమాపణలు చెబుతున్నాము అంటూ ప్రణీత్ హనుమంతు పై విమర్శల కుప్పించాడు. అలానే మరో యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ కూడా ప్రణీత్ హనుమంతు గురించి తన వాయిస్ రైజ్ చేశాడు.

- Advertisement -

Harom Hara

ఏదేమైనా ప్రణీత్ హనుమంతు కొన్ని సినిమాల పైన కామెంట్స్ చేసిన కొందరు నటుల పైన కామెంట్స్ చేసిన ఎవరూ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ చైల్డ్ అబ్యూజ్ చేయడం అనేది క్షమించరాని విషయం. అందుకే దీనిపైన చాలామంది హీరోలతో పాటు సినిమా ప్రముఖులు అలానే నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద శిక్షను అనుభవిస్తారు అని అందరూ భావిస్తున్నారు. వీటన్నిటికీ క్షమాపణలు చెబుతూ ప్రణీత్ ఒక వీడియో చేసినా కూడా దానిపై కూడా అందరు కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు