Star Hero : బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్ గా నటించడంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే పాన్ ఇండియా మూవీలో సైఫ్ భాగం కాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, సైఫ్ గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా టాలీవుడ్ మూవీ లవర్స్ తెలుసుకోవడానికి తెగ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ తన రెండవ భార్య కరీనా కపూర్ కు విడాకులు ఇవ్వబోతున్నాడు అనే వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా సైఫ్‌కి సంబంధించి మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని సైఫ్ సన్నిహితుడైన నిర్మాత సూరజ్ బర్జాత్యా వెల్లడించారు. ఓ నిర్మాత కోసం సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ ఆయనకు భోజనంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చిందట. మరి ఆమె ఎందుకలా చేసిందో చూద్దాం పదండి.
స్వయంగా వెల్లడించిన నిర్మాత
నిర్మాత సూరజ్ బర్జాత్యా కొంతకాలం క్రితం రాజశ్రీ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్ కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సూరజ్ ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రూపొందిన హమ్ సాథ్ సాథ్ హై హై సినిమా షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఎలా వ్యవహరించాడో వెల్లడించారు. నిర్మాత మాట్లాడుతూ ఆ సినిమా షూటింగ్ టైమ్ లో సైఫ్ పర్ఫెక్ట్ షాట్స్ ఇవ్వలేకపోయాడు. దాంతో మళ్లీ మళ్లీ రీటేక్‌లు తీయాల్సి వచ్చింది. నిజం చెప్పాలంటే ఆ సమయంలో సైఫ్ తన వ్యక్తిగత జీవితంలో హెచ్చు తగ్గులను ఎదుర్కొన్నాడు” అంటూ చెప్పుకొచ్చారు.
భోజనంలో స్లీపింగ్ పిల్
నిద్ర లేకపోవడంతో సైఫ్ ఇలా చేస్తున్నాడని సూరజ్ బర్జాత్యా గమనించి, సైఫ్ మొదటి భార్య అమృత (అమృతా సింగ్)కి భోజనం సమయంలో నిద్రమాత్రలు ఇవ్వాలని సూచించారట. సూరజ్ చెప్పినట్లే భర్త సైఫ్‌కి నిద్ర మాత్రలు ఇచ్చింది అమృత. దీంతో సైఫ్ పర్ఫెక్ట్ గా నిద్రపోగలిగాడని సూరజ్ వెల్లడించారు. ఆ తరువాత సినిమా షూటింగ్ అనుకున్నట్టుగా చేయగలిగారట. ఇదిలా ఉంటే ఇప్పటికే సైఫ్ తన మొదటి భార్య అయిన అమృతకు విడాకులు ఇచ్చి, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ను పెళ్ళాడిన విషయం తెలిసిందే. ఆయన మొదటి భార్య బిడ్డనే ఇప్పటి యంగ్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్.
కరీనాతో విడాకుల రూమర్లు
ఇటీవల సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ విడాకులు వార్తలు బాగా హల్చల్ చేశాయి. ఎందుకంటే కరీనా కపూర్ మీద ఉన్న ప్రేమతో గతంలో సైఫ్ ఆమె పేరును తన చేతిపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. అయితే ఇటీవల దానిని ఆయన రిమూవ్ చేసి వేరే టాటూను వేయించుకున్నారు. దెంతో విడాకుల రూమర్లు రాగా, సైఫ్ త్వరలో ప్రారంభం కానున్న సినిమా కోసం తన చేతిపై కరీనా పేరు త్రిశూలం టాటూ వేయించుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. దీంతో వీరి విడాకుల రూమర్లకు తెర పడింది.