Anushka Shetty : అనుష్క డెబ్యూ మూవీ తెలుగులో కాదని తెలుసా? ఎలా ఎంట్రీ ఇచ్చిందో అస్సలు ఊహించలేరు

Anushka Shetty : సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఎవరికి తెలియదు చెప్పండి? దేవసేనగా ఈ అమ్మడు ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. బాహుబలితో వచ్చిన ఆ అంతర్జాతీయ గుర్తింపుతో దేశవిదేశాల్లో కోట్లాదిమంది అభిమానులఅను సంపాదించుకున్నారు ఆమె. అయితే అనుష్క గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ఒకటి ఉంది. చాలామంది ఆమె డెబ్యూ మూవీ తెలుగులోనే చేసిందని అనుకుంటారు. కానీ అంతకంటే ముందే మరో భాషలో స్క్రీన్ పై మెరిసింది అనుష్క. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

అనుష్క అసలు పేరు ఇదే

అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత అనుష్క శెట్టిగా తన పేరును మార్చుకుంది. 1981 నవంబర్ 7న జన్మించిన అనుష్క శెట్టి తెలుగు,  తమిళ చిత్రసీమలో ప్రసిద్ధ నటి. అనుష్క దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకాలోని బెలిపాడి గ్రామానికి చెందిన తులు మాట్లాడే బంట కుటుంబానికి చెందినది. తల్లి పేరు ప్రఫుల్ల, తండ్రి పేరు ఎ.ఎన్. విఠల్ శెట్టి. ఆమెకు ఇద్దరు అన్నలు గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి ఉన్నారు. అనుష్క బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పట్టభద్రురాలైంది. ఆమె యోగా టీచర్ కూడా.

Happy Birthday Anushka Shetty: Best performances of Telugu cinema's 'lady  superstar'

- Advertisement -

అనుష్క ఎంట్రీ తెలుగులో కాదు

ఇదిలా ఉండగా అనుష్క తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన సంగతి చాలా మందికి తెలిసిందే. అయితే ఆమె తొలిసారిగా కన్నడ సీరియల్‌లో నటించిందని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ సీరియల్ పేరు ‘బన్నా’.

2005లో విడుదలైన తెలుగు చిత్రం ‘సూపర్‌’తో అనుష్క సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఇది ఆమెకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి – తెలుగు నామినేషన్‌ని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ విక్రమార్కుడు, లక్ష్యం (2007), శౌర్యం (2008), చింతకాయల రవి (2008) వంటి సినిమాలలో గ్లామర్ రోల్స్ చేసింది. అయితే 2009లో అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన తెలుగు ఫాంటసీ చిత్రం ‘అరుంధతి’లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేసింది. ఈ మూవీ ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాకే అనుష్క మొదటి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. అంతే కాకుండా ఈ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తరువాత బాహుబలితో ఆమె ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి నుంచి అనుష్క ప్రయాణం అందరికీ తెలిసిందే.

ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఆమె మూడు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులు, రెండు నంది అవార్డులు, రెండు SIIMA అవార్డులు, ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుని సక్సెస్ ఫుల్ నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పటిదాకా 50కి పైగా చిత్రాలలో వివిధ పాత్రల్లో కనిపించిన అనుష్క దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. 2010లో తమిళనాడు ప్రభుత్వం ఆమెను “కళైమామణి” అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం అనుష్క వయసు 42 ఏళ్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు