Ma Dong Seok : ప్రభాస్ కు విలన్ అంటూ రూమర్స్… మా డాంగ్ సియోక్ ఎవరో తెలుసా?

Ma Dong Seok : రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో స్పిరిట్ ఒకటి. ఈ ఇంటెన్స్ యాక్షన్‌కి సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసుగా నటిస్తున్నాడు. రీసెంట్ గా యానిమల్ థియేటర్లను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో చేస్తున్న మూవీ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇదే మూవీపై ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచి ప్రభాస్ స్పిరిట్ గురించి మీడియాలో పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాటి ప్రకారం దక్షిణ కొరియా నటుడు మా డాంగ్-సియోక్ ఈ భారీ అంచనాలున్న ప్రాజెక్ట్‌లో విలన్ గా నటిస్తున్నాడని అంటున్నారు. మరి ఇంతకీ ఈ మా డాంగ్ ఎవరు?

మా డాంగ్ సియోక్ ఎవరు?

ప్రభాస్ హీరోగా నటించనున్న స్పిరిట్‌లో విలన్‌గా నటించడానికి దక్షిణ కొరియా నటుడు మా డాంగ్ సియోక్‌ను మేకర్స్ సెలెక్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పలు భాషలలో పాన్-ఆసియన్ మూవీగా రిలీజ్ కాబోతున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో సౌత్ కొరియన్ పాపులర్ యాక్టర్ మా డాంగ్ సియోక్ తో ప్రభాస్ హోరాహోరీగా తలపడబోతున్నాడు అనే వార్తా ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది.

Ma Dong-seok filmography - Wikipedia

- Advertisement -

కాగా మా డాంగ్ సియోక్ తన 15 సంవత్సరాల సినీ కెరీర్‌లో 50 సినిమాలు చేసిన ప్రముఖ కొరియన్ నటుడు. అతను దక్షిణ కొరియా చిత్రాల్లో యాక్షన్ సూపర్ స్టార్. కొరియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతన్ని డాన్ లీ అని ముద్దుగా పిలుచుకుంటారు. 53 ఏళ్ల మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్టులు మార్క్ కోల్‌మన్, కెవిన్ రాండిల్‌మాన్‌లకు వ్యక్తిగత శిక్షకుడిగా ప్రసిద్ది చెందారు. అతని పాపులర్ సినిమాలలో ట్రైన్ టు బుసాన్, డీరైల్డ్, ది అవుట్‌లాస్, ది బాడ్ గైస్: రీన్ ఆఫ్ ఖోస్, ది గ్యాంగ్ స్టర్, ది డెవిల్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఎటర్నల్స్ వంటి చిత్రాలు ఉన్నాయి. వీటన్నింట్లో ఎటర్నల్స్, ట్రైన్ టు బుసాన్ రెండు సినిమాలు కూడా బాగా పాపులర్. ఈ సినిమాలను ఇప్పటికే వీక్షించిన వారికి పేరు తెలియకపోయినా మా డాంగ్ సియోక్ ను గుర్తుపడతారు. అయితే ఈ రోజుల్లో K-Pop, కొరియన్ -డ్రామాకు పెరుగుతున్న ప్రజాదరణను పరిగణనలోకి తీసుకున్న డైరెక్టర్ సందీప్ ఆయనను స్పిరిట్‌లో నటింపజేయాలనే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేశారే ?!

స్పిరిట్ లో తన పాత్ర కోసం మా డాంగ్ సియోక్ తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ ను కూడా రూమర్ రాయుళ్ళు అప్పుడే ఫిక్స్ చేశారు. ఈ కొరియన్ నటుడు రూ. 10 కోట్లు పారితోషికంగా తీసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. యాక్షన్ చిత్రం స్పిరిట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, కొరియన్, జపనీస్, చైనీస్‌తో సహా పలు భాషలలో పాన్-ఆసియన్ రిలీజ్ కాబోతుందని చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు