Dulquer Salman : లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్..!

Dulquer Salman : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఒక్క తెలుగులోనే మూడు ప్రాజెక్టులు చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అందరి దృష్టి “లక్కీ భాస్కర్” పైనే ఉంది. ఈ సినిమా మొదలై చాలా రోజులే అయినా, పలుమార్లు షూటింగ్ వాయిదా పడుతూ, రిలీజ్ డేట్ ని కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా ఫిక్స్ చేసారు మేకర్స్. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చునర్ ఫోర్ శ్రీకర స్టూడియోస్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా, వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా మేకర్స్ ప్రకటించారు.

Dulquer Salman starrer Lucky Bhaskar movie release date fixed

లక్కీ భాస్కర్ రిలీజ్ ఆరోజునే!

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాను 2024 సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇక దానికి రెండు రోజుల ముందు దళపతి విజయ్ నటించిన ది గోట్ సెప్టెంబర్ 5న రిలీజ్ కానుండగా, తెలుగులో నారా రోహిత్ నటిస్తున్న సుందరకాండ కూడా సెప్టెంబర్ 6న విడుదల అవుతుంది. మరి పోటీ కూడా బాగా ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఇప్పటినుండే గట్టిగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా టీజర్ లో ఒక మధ్య తరగతి బ్యాంకు ఉద్యోగి అయిన భాస్కర్ గా దుల్కర్ కనిపిస్తున్నాడు. అయితే ఊహించని విధంగా భాస్కర్ అకౌంట్లో చాలా డబ్బు ఉంటుందని టీజర్ చివర్లో ఆ పాయింట్ చెప్పడం తో సినిమాపై ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఇక లక్కీ భాస్కర్ 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా, దర్శకుడు వెంకీ అట్లూరి ప్రేక్షకులను 30 ఏళ్ళు వెనక్కి తీసుకు వెళ్లే విధంగా సినిమాను డిజైన్ చేస్తున్నాడు.

- Advertisement -

సాంగ్స్ పైనా స్పెషల్ ఫోకస్..

ఇక ఈ సినిమాలో సాంగ్స్ పైన కూడా మేకర్స్ స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. లక్కీ భాస్కర్ (Dulquer Salman) నుండి రీసెంట్ గా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయగా, ”శ్రీ‌మ‌తి గారు” అంటూ సాగే ఆ పాట మంచి ఫ్రెష్ ట్యూన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. ఇక ఈ సినిమాకు జివి.ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, తన మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలవనుంది. లక్కీ భాస్కర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య‌లు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు