Thangalaan : ఎట్టకేలకు ట్రైలర్ వచ్చేస్తోంది.. ఇక ప్రమోషన్లపైనే ఫోకస్..

Thangalaan : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ లో ఉన్న విలక్షణమైన నటుల్లో విక్రమ్ ఒకరు. సినిమా కోసం, పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయగల ఈ హీరోకి చాలా ఏళ్లగా నిఖార్సైన హిట్ మాత్రం దక్కడం లేదు. రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ హిట్ అయినా అది మల్టీ స్టారర్ సినిమా కాబట్టి క్రెడిట్ కూడా అందరికి దక్కుతుంది. అయితే విక్రమ్ “తంగలాన్” అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. రెండేళ్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయిపోగా, రిలీజ్ మాత్రం కొన్ని నెలలుగా వాయిదా పడుతూనే వస్తుంది. ఎప్పుడో జనవరిలోనే రిలీజ్ అవుతుందన్న ఈ సినిమా షూటింగ్ డిలే వల్ల పోస్ట్ పోన్ కాగా, ఫైనల్ గా పలు వాయిదాల అనంతరం “తంగలాన్” సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా నుండి ఫైనల్ గా అందరూ ఎదురుచూస్తున్న అప్డేట్ అయితే వచ్చింది.

Thangalaan Movie Trailer Update

వచ్చేస్తున్న ట్రైలర్.. దీంతోనే ప్రమోషన్లు మొదలు..

తాజాగా విక్రమ్ నటించిన తంగలాన్ నుండి ట్రైలర్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. తంగలాన్ ట్రైలర్ అఫిషియల్ గా జులై 10న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి పలు పోస్టర్ లు, టీజర్ మినహా మరే అప్డేట్ కూడా రాని నేపథ్యంలో ట్రైలర్ పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఇక టీజర్ లో ఈ సినిమాలో ఒక బంగారం నిల్వలు ఉండే చోటు గురించి కొన్ని తెగల మధ్య పోరాటం సాగుతుందని తెలుస్తుంది. పైగా టీజర్ లో ఒక్క డైలాగ్ ని కూడా వినిపించలేదు. కేవలం ఆక్షన్ సన్నివేశాలతోనే నింపేశారు. మరి ఇప్పుడు ట్రైలర్ లో సినిమా గురించి ఏ అంశాలను చుపిస్తున్నారో, ఆడియన్స్ లో ఎంత బజ్ క్రియేట్ చేస్తారో చూడాలి.

- Advertisement -

ఆగష్టు 15న రిలీజ్…

ఇక తంగలాన్ (Thangalaan) ని ఆగష్టు 15న విడుదల చేస్తుండగా, లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకుంటుందని తెలుస్తుంది. ఇక ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కాగా, మొదటి సోమవారం, రక్షా బంధన్ కారణంగా సెలవు, కాబట్టి ఏకంగా ఐదు రోజుల లాంగ్ వీకండ్ దొరుకుతుంది కాబట్టి, ఈ మేకర్స్ ఇప్పటినుండే భారీ ప్రమోషన్లు చేస్తే, రిలీజ్ టైం కల్లా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చి, వీకెండ్ లోనే బాగా పిండుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక తంగలాన్ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ వారు నిర్మించారు. ఇక గోల్డ్ గనులు ఉన్న ప్రాంతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తంగలాన్ రూపొందించబడిందని సమాచారం. ఈ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు