Tollywood Star hero: సాధారణంగా పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి వారైనా సరే తమ మేకవర్ ను మార్చుకోవాల్సిందే.. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో తన మేకోవర్ ను మార్చుకోవడమే కాదు గుర్తుపట్టలేనంతగా మారిపోయి.. అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.. తెల్లటి గుబురు గడ్డం.. పొడువాటి మీసాలు.. భుజంపై బాణాలు.. ఇలా సరికొత్తగా కనిపిస్తున్న ఈ హీరోని చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇక పైన కనిపిస్తున్న ఫోటోను చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.. అంతకన్నా ముందు చాలామంది ఇతను ఎవరో కూడా గుర్తుపట్టలేకపోతూ ఉండడం గమనార్హం. ఇక తర్వాత ఆయన ఎవరో తెలిసి… ఇంతలా మారిపోయారు ఏంటి.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.. ఇంతకు ఆ హీరోని ఎవరో గుర్తుపట్టారా ? ఆయన ఎవరో కాదు.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్..
శివరాజ్ కుమార్ కొత్త లుక్..
కన్నడ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించి భారీ క్రేజ్ అందుకున్న ఈయన సౌత్ స్టార్ హీరోల సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇటీవలే రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరైన శివన్న ఇప్పుడు మరో సరికొత్త పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం ” భైరవనకోన పాటా”.. లెసన్స్ ఫర్ ది కింగ్ అనే ఇంగ్లీష్ క్యాప్షన్ కూడా ఇచ్చారు.. తాజాగా ఈ సినిమా టైటిల్ విడుదలవ్వగా.. ఈ టైటిల్ కూడా అందరిలో ఆసక్తిని కలిగించింది..
భైరవణ కోన పాటా మూవీ పోస్టర్..
తాజాగా ఈ సినిమా టైటిల్ ని విడుదల చేస్తూ.. పోస్టర్ని కూడా వదిలారు..ఇందులో తెల్లటి గుబురు గడ్డం మీసాలతో సరికొత్త లుక్కులో శివరాజు కుమార్ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం.. భుజంపై బాణాలు అలాగే అతని వైపు దూసుకొస్తున్న బాణాలు.. గుర్రం తదితర వాటిని చూస్తుంటే ఇదేదో పీరియాడికల్ చిత్రం లాగా అనిపిస్తుంది.. మొత్తానికైతే అటు సినిమా టైటిల్ పైన ఇటు ఇంగ్లీష్ క్యాప్షన్ పైన ఆసక్తి నెలకొంది.. హేమంత్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
డైరెక్టర్ హేమంత్ రావు సినిమాలు..
గతంలో గోది బల్ల సదర్ మైకట్టు , సప్త సాగరదాచే ఏలో, కావలి దారి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇప్పుడు ఈయనతో చేతులు కలపడంతో ఈ చిత్రంపై అంచనాలు మొదలయ్యాయి.. వైశాక్ జే ఫిలిమ్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. వీటివలే సినిమా షూటింగ్ ప్రారంభమైంది కాబట్టి ఇప్పట్లో సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపించట్లేదు.. మరోవైపు ఉత్తరాకాండ, బైరతి రంగల్ వంటి చిత్రాలలో శివరాజు కుమార్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా విడుదలవుతున్న భైరవన కోన పాటా సినిమా సౌత్ ఇండియా లెవెల్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . కన్నడ తో పాటు తెలుగు, తమిళ్, మలయాళం భాషలో విడుదల కానుంది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లో శివరాజ్ కుమార్ కొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.
Bhairava is here!!! #Shivanna ❤️#BhairavanaKonePaaTa #BKP #VJFilms pic.twitter.com/7EJGCSiSJf
— Hemanth M Rao (@hemanthrao11) July 8, 2024