Harish Shankar: హరీష్ శంకర్ ను మళ్ళీ ఎవరో కెలికారు , ముసలి నక్క అంటూ వార్నింగ్

Harish Shankar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో హరీష్ శంకర్ ఒకరు. హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయానికి తనదైన శైలిలో చాలా తొందరగా స్పందిస్తాడు హరీష్. ఇకపోతే చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాయడంలో కూడా హరీష్ శంకర్ ఫేమస్ అని చెప్పొచ్చు. షాక్ మాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గబ్బర్ సింగ్ సినిమా క్రియేట్ చేసిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా ఆ సినిమా అప్పట్లో నిలిచింది.

ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో చేసిన రామయ్య వస్తావయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది. అయితే ఒక సందర్భంలో అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న వ్యతిరేకత కారణంగా హరీష్ శంకర్ కూడా హర్ట్ అయ్యాడు. తను తీసిన దువ్వాడ జగన్నాథం సినిమా చాలా ఎఫెక్ట్ అయింది. ఆ సందర్భంలోనే కట్టికాలే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ చెప్పకు వచ్చాడు. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు హరీష్ శంకర్.

Harish Shankar

- Advertisement -

ట్విట్టర్లో హరీష్ శంకర్ చాలామందికి రిప్లై ఇస్తూ ఉంటారు. హరీష్ గురించి వచ్చిన ఆర్టికల్ విషయంలో కూడా రెస్పాండ్ అవుతూ ఉంటాడు. ఇకపోతే హరీష్ శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చాడు హరీష్. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఎవరో ఒక వ్యక్తి హరీష్ శంకర్ను టార్గెట్ చేయడం వలన ట్విట్టర్ వేదిక స్పందించాడు హరీష్.రిలీజ్ దగ్గర పడుతుంది కదా ఏం పోస్ట్ చేసినా తగ్గుతాడు అని ఒక ముసలి నాకు మళ్ళీ మొదలు పెడుతుంది దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి నా జోలికి వస్తే రేపు రిలీజ్ అయిన వదలను అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు