Bhumika Chawla: టాలీవుడ్ స్టార్ట్స్ పై ఒక్క మాటలో.. ఫ్యాన్స్ ఏమన్నారంటే..?

Bhumika Chawla.. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమిక.. తన అంద చందాలతో.. నటనతో.. అభిమానులలో ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తో సింహాద్రి ..పవన్ కళ్యాణ్ తో ఖుషీ , మహేష్ బాబు తో ఒక్కడు ఇలా ఒక సినిమాను మించి మరొక సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ మూడు సినిమాలు కూడా ఆయా హీరోల సినీ కెరియర్ లో ఏడో సినిమా కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో భూమిక రీ ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.. వయసు పెరిగినా సరే ఈమె అందంలో పెద్దగా మార్పు రాలేదు.. ఇక ఇప్పటికీ కూడా తన అంద చందాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ..

Bhumika Chawla: In one word on Tollywood starts.. What are the fans..?
Bhumika Chawla: In one word on Tollywood starts.. What are the fans..?

స్టార్ హీరోలపై ఒక్క మాటలో కామెంట్..

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమిక తనతో గతంలో కలిసి నటించిన హీరోల గురించి ఒక్కమాటలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ విషయాలు చూసి అభిమానులు సైతం సంతోషాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ ఒక్కొక్క హీరో పేరు గురించి అడగగా.. ఈమె ఇలా సమాధానం చెప్పింది మహేష్ బాబు క్యూట్ మాత్రమే కాదు అందరితో సరదాగా ఉంటారని కామెంట్లు చేసింది భూమిక.. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటలిజెంట్ అని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ డాన్సర్ అని చెప్పుకొచ్చింది.. అలాగే జై చిరంజీవ సినిమాలో చిరంజీవితో భూమికా కలిసిన నటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాను ఉద్దేశించి చిరంజీవి గ్రేట్ డాన్సర్ అంటూ చెప్పుకొచ్చింది.. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించిన భూమిక కెరియర్ పరంగా మరింత ఎత్తు ఎదగాలని.. మరిన్ని బ్లాక్ బాస్టర్ హిట్ల ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలంటున్న ఫ్యాన్స్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఈమె ఇంస్టాగ్రామ్ లో 1.5 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికీ అభిమానులకు అందుబాటులో ఉంటే డైరెక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉందని.. తద్వారా బలమైన పాత్రలు ఈమెకు ఆఫర్ చేసి తన కెరీర్ ను మరింత పుంజుకునే అవకాశం కూడా లేకపోలేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. మరి అభిమానుల కోరిక మేరకు ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా నెక్స్ట్ లెవెల్ లో ప్రాజెక్ట్లను ఎంచుకోవాలని.. రాబోయే రోజుల్లో కెరియర్ పరంగా సత్తా చాటాలని కోరుకుంటున్నారు. మరి అభిమానులు కోరుకుంటున్నట్టుగానే భూమిక తన కెరియర్ ను ఏ మేరకు ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. మొత్తానికి అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోల గురించి చెప్పి వారి అభిమానులను సంతోష పరచడమే కాదు వారి ఆదరణను కూడా పొందింది భూమిక.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు