Kalki2898AD : అయ్యో పాపం బాలీవుడ్‌… ఉన్న ఒక్కటి కూడా పాయే…!

Kalki2898AD : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి2898AD సినిమా రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా యానానిమస్ గా అన్ని భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్స్ నుండే భారీ కలెక్షన్లతో థియేటర్లలో హౌస్ ఫుల్ అవుతూ రచ్చ చేస్తుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అమితాబ్, కమల్ ల వైవిధ్యమైన నటనకి యాక్షన్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. పైగా విజువల్స్ పరంగా హాలీవుడ్ సినిమాలని తలపించే రేంజ్ లో ఉండడంతో కల్కి వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా కల్కి ఖాతాతో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది.

Kalki2898AD Movie Crossed Fighter Movie Collections

బాలీవుడ్ నెంబర్ వన్ గా కల్కి…

బాలీవుడ్ లో ఈ ఇయర్ విడుదలైన చాలా పెద్ద సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. ప్లాప్ ల సంగతి పక్కన బెడితే ఈ ఏడాది పట్టుమని పది హిట్లు కూడా బాలీవుడ్ ఖాతాతో చేరలేదు. అప్పుడెప్పుడో ఐదు నెలల కింద రిలీజ్ అయిన హృతిక్ రోషన్ ఫైటర్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా మంచి కలెక్షన్లు వసూలు చేసి ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత సైతాన్ వంటి చిన్న సినిమాలు కొన్ని సక్సెస్ అయ్యాయి. ఒక పక్క మల్లూవుడ్ ఇండస్ట్రీ వంటి చిన్న ఇండస్ట్రీ నుండి కూడా వంద కోట్ల బ్లాక్ బస్టర్స్ వస్తుంటే ఒక్క హిట్ కోసం బాలీవుడ్ తపించాల్సి వస్తుంది. తాజాగా ప్రభాస్ కల్కి (Kalki2898AD) సినిమా ఉన్న ఫైటర్ రికార్డుని కూడా బ్రేక్ చేసి ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

- Advertisement -

ఉన్న ఒక్క దాన్ని లేపేసిన కల్కి…

ఈ ఇయర్ రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాల్లో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా 215 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకుని, ఈ ఇయర్ లో బాలీవుడ్ నుండి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఫైటర్ కలెక్షన్స్ ని కల్కి2898AD మూవీ కేవలం 12 రోజుల కలెక్షన్స్ తో బ్రేక్ చేసి 2024 ఇయర్ లో బాలీవుడ్ నుండి హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీ గా నిలిచింది. నిజానికి రిలీజ్ కి ముందు కల్కి పై బాలీవుడ్ లో మరీ ఎక్కువ అంచనాలు లేకపోయినా, రిలీజ్ తర్వాత యానానిమస్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తూ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక లాంగ్ రన్ లో 250 నుండి 300 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉంది. మరి బాలీవుడ్ లో రాబోయే రోజుల్లో ఈ రికార్డును ఏ సినిమా బ్రేక్ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు