Tollywood Beauty: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించిన విషయాలే కాదు వారి చిన్ననాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.. వారి పాత ఫోటోలు ప్రస్తుతం ఫోటోలు చూసి ఇంతలోనే అంత మార్పు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.. ఈ క్రమంలోనే తాజాగా పైన ఫోటోలో.. రెడ్ డ్రెస్ వేసుకొని చాలా క్యూట్ గా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఆమె మేకవర్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. అప్పుడు అంత పద్ధతిగా కనిపించిన ఈమె.. ఇప్పుడు ఇంత గ్లామర్ గా మారిపోయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా..
ఈమె ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పనిచేసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది.. ఎప్పుడైతే ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసిందో ఇక అప్పటి నుంచి ఈమె క్రేజ్ కు కొదవలేదు అని చెప్పవచ్చు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ.. తన హాట్ అందాలతో యువతకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో సోషల్ మీడియాలో మంట పుట్టిస్తోంది. ఇక ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఎవరో కాదు అరియానా గ్లోరీ.. తాజాగా ఈ అమ్మడి చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటో చూడగానే మొదట అభిమానులకు ఈమెను గుర్తుపట్టడం కష్టమే ..అయితే ఈమెను చూసిన తర్వాత అప్పుడు అలా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఇంత అందంగా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు..
అరియానా గ్లోరీ కెరియర్..
ఇక ఈమె అసలు పేరు మంగలి అర్చన.. 2015లో యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయిపోయింది ..ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లోకి అడుగుపెట్టి అక్కడ తన నటనతో అందచందాలతో యువతను ఆకట్టుకుంది. ఇదే ఈమె కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు.. యాంకర్ గా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఈమె బీబీ జోడి షోలో కమెడియన్ అవినాష్ తో కలిసి డాన్స్ చేసి తనలోని మరో యాంగిల్ ను పరిచయం చేసింది.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఇన్స్టా లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్ లు షేర్ చేస్తూ నెట్టింట మంట రేపుతోంది. తన స్నేహితురాలు ప్రముఖ యాంకర్ నటి ఆషు రెడ్డితో చేసే సందడి.. షేర్ చేసే గ్లామర్ షో అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.. ఏది ఏమైనా అరియానా చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram