Guess The Child : ఈ మధ్య కాలంలో సినీతారల పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. పైన కనిపిస్తున్న బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఆయన మరెవ్వరో కాదు మ్యాచో స్టార్ గోపీచంద్.. ఈయనకు ఇద్దరు పిల్లలు ఆ కుర్రాడు చిన్నకొడుకు.. అచ్చం తండ్రీలాగే ఉన్నాడుగా..ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలను చూసి ఫ్యాన్స్ లైకులు, షేర్లు చేస్తున్నారు..
మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు విలన్ గా కొన్ని సినిమాలు చేశాడు.. మంచి పేరును తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత తొలివలపు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమాతో హీరోగా బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించాడు.. అప్పట్లో అతని సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు ప్లాప్ టాక్ ను అందుకోవడంతో ఇప్పుడు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకొని మరి కొత్త సినిమాలు చేస్తున్నాడు..
గోపి చంద్ తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు… ఆ సినిమాలో విలన్ గా నటించాడు.. ఆ తర్వాత నిజం సినిమాలో కూడా విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. తొలివలపు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.. ఒక్కో సినిమాతో హిట్ టాక్ ను సొంతం చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యాడు..గతఏడాది వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.. ప్రస్తుతం విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..గోపి చంద్ పర్సనల్ విషయానికొస్తే.. శ్రీకాంత్ మేనకోడలు రేష్మ ను పెళ్లి చేసుకున్నాడు.. ఆమె గోపి చంద్ ను ఇష్టపడటంతో ఇరు కుటుంబాల వాళ్లు కలిసి పెళ్లి చేశారు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు..