Raayan: ధనుష్ సినిమాకి పర్ఫెక్ట్ రన్ టైం, వర్కౌట్ అయితే దర్శకుడుగా సక్సెస్

Rayaan: ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటినుంచో ధనుష్ తమిళ్లో చేసే సినిమాలు అన్నీ కూడా తెలుగులో డబ్బింగ్ అవుతూ వస్తున్నాయి. తెలుగులో డబ్బింగ్ గాని సినిమాలను కూడా తమిళ్లో చూసిన తెలుగు ఆడియన్స్ ఉన్నారు. ఇంక ధనుష్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం నటుడు గానే కాకుండా రచయితగా దర్శకుడుగా సింగర్ గా కూడా తన ప్రతిభను చూపించాడు. ఇకపోతే తన కెరియర్లు దాదాపు 50 సినిమాలను చేశాడు ధనుష్.

ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంలో రాయణ్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళ్లో కూడా మంచి సర్కిల్ సందీప్ కి ఉంది. చాలామంది కొత్త డైరెక్టర్లతో పనిచేయడానికి సందీప్ కిషన్ ఇష్టపడుతూ ఉంటాడు. తెలుగులో సినిమాలు చేసినట్లే అలవోకగా తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇదివరకే చాలా తమిళ్ సినిమాలు కీలక పాత్రలో కనిపించాడు సందీప్. ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో రాయణ్ కూడా కనిపించనున్నాడు.

Raayan

- Advertisement -

ఇకపోతే ఈ సినిమా జులై 26న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరణంలో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పీచు మిఠాయి అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా డ్యూరేషన్ ఇప్పుడు తెలుస్తుంది. రెండు గంటల 25 నిమిషాల 12 సెకండ్లు ఈ సినిమా నిడివి ఉండనుంది. అయితే ఈ రోజుల్లో చాలా సినిమాలు దాదాపు 3 గంటలు పాటు ఉంటున్నాయి. ఇకపోతే చాలా తక్కువ రన్ టైం తో ధనుష్ ఈ సినిమా దించడం సేఫ్ జోన్. ఈ సినిమా వర్క్ అవుట్ అయితే దర్శకుడుగా కూడా ధనుష్ సక్సెస్ కొట్టినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు