Hanuman: అలా చేస్తే అందరూ సినిమాకి రారు, క్వాలిటీ ముఖ్యం- చైతన్య రెడ్డి

Hanuman: ఒక మంచి సినిమా రిలీజ్ అయింది దానికి భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ ఎప్పుడో ఆదరిస్తూనే ఉంటారు. తెలుగు ఆడియోన్స్ కి సినిమాకి ఉన్న అనుబంధం విడదీయలేనిది. అయితే రీసెంట్ టైమ్స్ లో థియేటర్ కు వచ్చి సినిమాలు చూసే ఆడియన్స్ తగ్గిపోయారు అనేది వాస్తవం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. థియేటర్లో ఒక సినిమాకు ఉండే టికెట్ రేట్ దగ్గర నుంచి ఇంటర్వెల్లో అమ్మే పాప్కార్న్ వరకు చాలా మార్పులు వచ్చాయి. ఒక కుటుంబం అంతా కలిసి సినిమాకి వెళ్లాలంటే కనీసం ఈజీగా 2 వేలు 3వేలు అయిపోతుంది. అలానే టికెట్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయాయి.

ఇకపోతే ఈ విషయంపై హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా పెద్ద సినిమాల మధ్య సంక్రాంతి పోటీలకు దిగింది ఈ సినిమా. అయితే ఆ సినిమాలన్నిటికంటే కూడా హనుమాన్ సినిమా సృష్టించిన విజయం తక్కువేమీ కాదు. మామూలుగా ముందు థియేటర్స్ దొరికిన ఈ సినిమాకు కేవలం ప్రేక్షకులు మౌత్ టాక్ ద్వారా రోజురోజుకీ థియేటర్స్ పెరిగి కలెక్షన్ కూడా పెరిగాయి. చాలా రోజుల తర్వాత 50 రోజులు పోస్టరు ఈ సినిమాతో చూసాము.

 Hanuman

- Advertisement -

 

ఇక హనుమాన్ సినిమా చిన్న పిల్లలతో పాటు పెద్ద వారందరికీ కూడా బాగా నచ్చింది. అలానే ఈ సినిమా టికెట్ రేట్లు కూడా సాధారణంగా ఉండటం బాగా ప్లస్ అయింది. దీని గురించి చైతన్య రెడ్డి మాట్లాడుతూ నేను సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టాను కదా అని చెప్పి టిక్కెట్ రేటు ఎక్కువ పెట్టలేను. 200 రూపాయలు టికెట్ రేట్ పెడితే 200 మంది చూస్తే, 400 రూపాయలు టికెట్ రేటు ఉన్నప్పుడు 100 మంది లేదా 50 మంది మాత్రమే చూస్తారు. ఇలా చేయడంవలన థియేటర్ కి వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోతుంది. సినిమా బడ్జెట్ తక్కువగా ఉండి మంచి క్వాలిటీ ఇవ్వాలి అంటూ చైతన్య రెడ్డి చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు