Sanjana : అర్థరాత్రి అసభ్యరకమైన మెసేజులు… వీఐపీ కొడుకు చీకటి బాగోతాన్ని బయట పెట్టిన హీరోయిన్

Sanjana : రేణుకాస్వామి హత్య కేసు: చిత్రదుర్గలోని రేణుకాస్వామి హత్య కేసులో నటుడు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. జైలుకెళ్లి నెల కూడా గడవలేదు, అప్పుడ దర్శన్ నెల రోజుల్లోనే దాదాపు 10 కిలోల శరీర బరువు తగ్గాడు. అయితే ఈ నేపథ్యంలోనే రేణుక స్వామి హత్య గురించి పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ సంజన అని కూడా తన మనసులోని మాటను బయటపెట్టింది. పైగా గతంలో తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

దర్శన్ కు సంజన సపోర్ట్

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సంజన గల్రాని మాట్లాడుతూ దర్శన్ ఇలాంటి పని చేసే మనిషి కాదు. అలాంటి సంఘటనలు అస్సలు జరగకూడదు. చట్ట ప్రకారం తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది. దర్శన్ త్వరగా జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ అతనికి తన సపోర్ట్ ను తెలియజేసింది. అలాగే ఈ సంఘటన గురించి తెలిసి తాను షాక్ అయ్యానని, ఇందులో దర్శన్ ప్రమేయం ఉండకూడదని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించింది. అంతలోనే ఈ ఘటనలో దర్శన్ ప్రమేయం ఉందేమో గాని అది దర్శన్ వల్ల మాత్రం జరగలేదన్నది నిజం అంటూనే అతనితో ఉన్న తన పరిచయాన్ని గుర్తు చేసుకుంది.

దర్శన్ తనకు వ్యక్తిగతంగా తెలుసని, అతనితో కలిసి అర్జున్ అనే సినిమాలో నటించినప్పుడు తనను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడని, తనతో పాటు మహిళలందరితోనూ అతను గౌరవంగా మాట్లాడతాని వివరించింది. అలాగే తన డ్రగ్స్ కేసు విషయంలో కూడా తనకు ధైర్యం చెప్పాడని పేర్కొంది. అయితే ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడిపై ఇలా దాడి జరగడం నమ్మశక్యంగా లేదని, హత్య చాలా క్రూరంగా జరిగిందని ఆవేదనను వ్యక్తం చేసింది. పగవాళ్లకు కూడా ఇలా జరగకూడదు అంటూనే సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే వ్యాఖ్యలను కొట్టి పారేయాలని సలహా ఇచ్చింది. అంతేకాకుండా రేణుక స్వామి కుటుంబానికి న్యాయం చేయాలని, అతని భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

- Advertisement -

Sanjjanaa Galrani (3) | RITZ

అసభ్యకర మేసేజులు…

అందులో భాగంగానే గతంలో తనకు జరిగిన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. రేణుక స్వామి పంపిన అసభ్యకరమైన మెసేజ్ ల వల్లే ఇలాంటి ఘటన జరిగింది అని చెప్పుకొచ్చింది సంజన. ఓ విఐపి కొడుకు తనకు అర్ధరాత్రి అసభ్యకరమైన సందేశాలు పంపగా, తన భర్తతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేశానని సంజన క్లారిటీ ఇచ్చింది. అయితే వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం న్యాయం వ్యవస్థ పట్ల మరింత గౌరవాన్ని పెంచిందని పేర్కొంది. జైలులో శిక్ష అనుభవించాక తప్పుడు శిక్ష అని చెప్పి తన కేసును క్లోజ్ చేసారని, జైల్లో అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అందుతుందని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు