Buddy: రిలీజ్ దగ్గర పడుతుంది కానీ మినిమం బజ్ లేదు, ఈ మెగా హీరోకి ఎందుకు ఇలా

Buddy: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోస్ లో అల్లు శిరీష్ ఒకరు. అయితే గౌరవం ఉన్న సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. ఆ సినిమా అద్భుతమైన కలెక్షన్లు తీసుకురాకపోయినా కూడా ఒక మంచి సినిమాను చేశాడు అని ఒక గౌరవం అయితే మాత్రం తీసుకొచ్చింది. అయితే ఇప్పటివరకు అల్లు శిరీష్ కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒకటి కూడా లేదు. కొన్ని సినిమాలు ఉన్నా కూడా అవి అంతంత మాత్రమే ఆడాయి. పరశురాం మారుతి వంటి దర్శకుల దర్శకత్వంలో కూడా సినిమాలు చేశాడు శిరీష్.

నీకు రీసెంట్ గా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత శిరీష్ చేస్తున్న సినిమా బడ్డీ. అల్లు శిరీష్ జంటగా గాయత్రి భరద్వాజ్ నటిస్తుంది. ఈ సినిమాకు సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా జూలై 26, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ఎక్కువ రోజులు టైం కూడా లేదు కానీ ఈ సినిమా గురించి మినిమం ప్రమోషన్స్ కూడా చేయట్లేదు చిత్ర యూనిట్.

BUDDY Movie

- Advertisement -

మామూలుగా అల్లు శిరీష్ సినిమాలంటేనే ప్రమోషన్స్ కొంచెం స్పీడుగానే ఉంటాయి అని చెప్పొచ్చు. స్వతహాగా ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో కూడా మంచి ఐడియా ఉంది శీరిష్ కి, ఇదివరకు శిరీష్ చేసిన అన్ని సినిమాలకి కూడా చాలా బాగా ప్రమోషన్ చేశారు. అల్లు అర్జున్ లాంటివాళ్ళు చీఫ్ గెస్ట్ గా కూడా హాజరై ఆడియో లంచ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇకపోతే బండి సినిమాకు సంబంధించి మినిమం బజ్ కూడా లేకుండా పోయింది. ఈ రోజుల్లో ఎంత మంచి సినిమా చేసినా కూడా ఆ సినిమా జనాల్లోకి వెళ్ళకపోతే సరైన ఆదరణ దాకడం కష్టమవుతుంది. మరి బడ్డి సినిమా విషయంలో ఎందుకు వెనకంజ వేస్తున్నారు అంతు చిక్కడం లేదు. ఒకవేళ ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు