Premi Vishwanath.. బుల్లితెరపై సీరియల్స్ లో ఎక్కువగా క్రేజ్ సంపాదించిన సీరియల్ ఏదంటే ప్రతి ఒక్కరు కూడా కార్తీకదీపం సీరియల్ అని చెబుతారు.. ఈ సీరియల్ క్రేజ్ అలాంటిది మరి.. ముఖ్యంగా ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పేరు ఎక్కడ చూసినా కూడా వినిపిస్తూ ఉంటుంది. టిఆర్పి రేటింగ్ విషయంలో కూడా మొదటి స్థానంలో దూసుకుపోయింది. అయితే ఈ సీరియల్ లో వంటలక్క తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సైతం సంపాదించింది. ఈమె అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్.. ప్రేమీ విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి.. అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
నవవసంతంతో రీయంట్రి..
కార్తీకదీపం సీరియల్ మొదటి భాగం పూర్తి అయిన తర్వాత రెండవ భాగాన్ని నవవసంతం అనే పేరుతో విడుదల చేసినా… ఒక మోస్తారులో ఆకట్టుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ప్రేమీ విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. చాలా మందికి తెలియకపోవచ్చు.. ముఖ్యంగా ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయం కూడా తెలియకపోవచ్చు. ప్రేమీ విశ్వనాథ్ కు కేరళ లో 2 స్టూడియోలు ఉండడమే కాకుండా సీరియల్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అందులోనే జరుగుతూ ఉంటాయట..
కొడుకుతో కలిసి రీల్ చేసిన వంటలక్క..
తాజాగా ప్రేమీ విశ్వనాథ్ తన కొడుకుతో కలిసి ఒక రీల్ ను సైతం షేర్ చేసింది.. ఈ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.. ఈ వీడియో చూసిన అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. వంటలక్కకు ఇంత పెద్ద కుమారుడు ఉన్నాడా? అంటూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ వీడియోకు మామ్ అండ్ సన్ అనే క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రేమీ విశ్వనాథ్.. అచ్చం హీరో లాగా కనిపిస్తూ ఉండడమే కాకుండా.. ఫిట్నెస్ తో స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నారు వంటలక్క కుమారుడు..
హీరోగా పరిచయం చేస్తారా..
మొత్తానికి ప్రేమీ విశ్వనాథ్ కుమారుడిని టాలీవుడ్ కి పరిచయం చేస్తే.. వంటలక్క కుమారుడి ముందు ఇతర హీరోలు కూడా దిగదుడుపే అన్నట్టుగా అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమాలలో వంటలక్క కుమారుడు ట్రై చేస్తారా లేదా చూడాలి.. మరి ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ హల్చల్ చేస్తాంది.
ప్రేమీ విశ్వనాధ్ కెరియర్..
ఇంకా ప్రేమీ విశ్వనాథ్ విషయానికి వస్తే.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని బుల్లితెర క్వీన్ గా పేరు దక్కించుకుంది ఇప్పుడు అదే పేరును నిలబెట్టుకుంటుంది అనుకుంటే నవవసంతం సీరియల్ తో ఆ ఇమేజ్ కాస్త పడిపోయేలాగా కనిపిస్తుంది.. మరి ఇప్పటికైనా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పూర్వవైభవాన్ని పొందుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సీరియల్ సక్సెస్ అవుతుందో చూడాలి. ఇకపోతే ఈమె కొడుకు కూడా హీరో కట్ అవుట్ తో చాలా అందంగా కనిపిస్తున్నారు.. మరి సినిమాలలో ట్రై చేస్తారో లేదో చూడాలి.
View this post on Instagram