Devara : దేవర సాలిడ్ అప్డేట్.. ఆ పార్ట్ ఫినిష్ చేస్తే చాలట!

Devara : టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఇప్పుడు కల్కి మ్యానియా తో ఊగిపోతూన్నారు. కానీ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా రావడంతో థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. అయితే ఆ తర్వాత రానున్న భారీ ప్రాజెక్ట్ “దేవర” నే. ఆగష్టు లో రావాల్సిన పుష్ప ఏకంగా డిసెంబర్ కి వాయిదా పడడంతో నెక్స్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘దేవర’నే కావడం విశేషం. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. అయితే షూటింగ్ డిలే వల్లే సమ్మర్ కి రావాల్సిన దేవర సెప్టెంబర్ కి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా దేవర టీం నుండి షూటింగ్ విషయమై సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.

Jr Ntr Devara Movie Latest Shooting Update

తుదిదశకు దేవర.. ఇక ఆ పార్ట్ ఫినిష్ చేస్తే చాలట..

ఎన్టీఆర్ దేవర (Devara) సినిమా దాదాపు ఏడాదిన్నరగా తెరకెక్కుతుండగా, మూడేళ్ళ కింద ఫిక్స్ అయిన ఈ సినిమా లేట్ గా మొదలు పెట్టినా నాన్ స్టాప్ గా షూట్ చేసారు. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం వల్ల, బాగా పగడ్బందీగా పక్కా ప్లానింగ్ తో చేయాలి. ఇక రీసెంట్ గా థాయిలాండ్ లో ఈ సినిమా షెడ్యూల్ జరిగిన విషయం తెలిసందే. గోవా లో చేయాల్సిన ఆ షెడ్యూల్ వర్షాల కారణంగా, థాయిలాండ్ కి షిఫ్ట్ చేయగా అక్కడ కూడ షూట్ ఫినిష్ చేసేసారు. ఇదిలా ఉండగా దేవర చిత్ర యూనిట్ నుండి లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం దేవర కి సంబంధించి కేవలం వారం రోజుల టాకీ పార్ట్ షూటింగ్ మాత్రమే బాకీ ఉందట. ఇది కాక మరో రెండు పాటలు మాత్రమే షూట్ చేయాల్సి ఉందట. అంటే మరో రెండు వారాల్లో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. జులై ఎండింగ్ కల్లా దేవర షూట్ మొత్తం పూర్తి చేసి ఇక ప్రమోషన్లపై మేకర్స్ ఫోకస్ పెడతారని తెలుస్తుంది.

- Advertisement -

ప్రమోషన్లలో వేగం..

ఇక దేవర చిత్రానికి సంబంధించి షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయిపోగా, మిగతా పార్ట్ ని ఈ మంత్ ఎండ్ కల్లా పూర్తి చేసి ప్రమోషన్లపై ద్రుష్టి పెట్టనున్నారు మేకర్స్. ఇక ఇప్పటివరకు టైటిల్ సాంగ్, టీజర్ రిలీజ్ అయి ఆకట్టుకోగా, ఈ నెలలో రెండో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక షూటింగ్ మొత్తం పూర్తి కాగానే పూర్తిగా ప్రమోషన్లపైనే ఫోకస్ పెట్టనున్నారు మేకర్స్. ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు